పసుపు ఎక్స్ పోర్ట్ హబ్ గా నిజామాబాద్ : అర్వింద్

పసుపు ఎక్స్ పోర్ట్ హబ్ గా నిజామాబాద్ : అర్వింద్

కాంగ్రెస్ పార్టీ పై ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ హేమహేమీలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. దాన్నీ వాళ్ళు విశ్లేషించుకోవాలని సూచించారు. ఎన్నికల కోసం పసుపు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీల పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ నేత మోదీ పసుపు బోర్డును ఇచ్చారని చెప్పారు. పసుపు రైతుల బాగోగులు తమ బాధ్యత అని అన్నారు. 

పసుపు ఎక్స్ పోర్ట్ హబ్ గా నిజమాబాద్ ను మార్చుతామని అర్వింద్ చెప్పారు. దేశ వ్యాప్తంగా పసుపు సాగు పెరిగిందని తెలిపారు. పసుపు సాగును ప్రోత్సహించడం, ఎగుమతులు పెంచటం ద్వారా పసుపుకి ధరలు పెరిగాయని చెప్పారు. పసుపు మీద రాజకీయం చేయటం మానేయాలని సూచించారు. మంత్రి తుమ్మలకు పసుపు మీద అవగాహన లేదన్నారు. ఆయనకు నైతిక విలువ లేదని విమర్శించారు. తుమ్మల ఇంకా తెలుగుదేశం మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పసుపు విస్తీర్ణం తగ్గిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్వింద్ ఫైర్ అయ్యారు.