నీలోఫర్ సూపరింటెండెంట్​పై సస్పెన్షన్​వేటు

నీలోఫర్ సూపరింటెండెంట్​పై సస్పెన్షన్​వేటు

మెహిదీపట్నం, వెలుగు: నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆస్పత్రి ప్రాంగణంలో ప్రైవేట్​మెడికల్ షాపు కోసం ఓ గది నిర్మాణం చేపట్టగా, అధికారులు దానిని కూల్చివేశారు. 

ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ రవి కుమార్​ను సస్పెండ్​చేస్తున్నట్లు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీడీయాట్రిక్ హెచ్ఓడీగా ఉన్న డాక్టర్ జి. విజయ్ కుమార్ ను ఇన్​చార్జ్​సూపరింటెండెంట్ గా నియమిస్తున్నట్లు వెల్లడించారు.