నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్

నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్

మెడికల్ విద్య చదవాలనుకుంటున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్కు గరిష్ట వయోపరిమితిని ఎత్తివేసింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ రాసేందుకు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 25 ఏళ్లు, రిజర్వేషన్ కేటగిరి వారికి 30 ఏళ్ల వయోపరిమితి నిబంధన ఉండేది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో గరిష్ట వయోపరిమితి నిబంధన తొలగిపోనుంది. దీంతో మరింత ఎక్కువ మంది వైద్య విద్య చదివేందుకు వెసులుబాటు కలుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.