ఐరన్ ​ఓర్​ రేటు  పెంచిన ఎన్​ఎండీసీ

ఐరన్ ​ఓర్​ రేటు  పెంచిన ఎన్​ఎండీసీ

న్యూఢిల్లీ: ఐరన్​ ఓర్​ రేటును గురువారం నుంచి పెంచుతున్నట్లు ఎన్​ఎండీసీ ప్రకటించింది. లంప్​ ఓర్​ రేటును టన్నుకు రూ. 200 చొప్పున, ఫైన్స్​ ఓర్​ రేటును టన్నుకు రూ. 100 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో లంప్​ ఓర్​  టన్ను  రేటు రూ. 4,100కి, ఫైన్స్​ ఓర్​  టన్ను రేటు రూ. 2,910 కి చేరాయి. కిందటి నెల (జులై) లో లంప్​ ఓర్​, ఫైన్స్​ ఓర్​ రేట్లను టన్నుకు రూ. 500 చొప్పున ఎన్​ఎండీసీ తగ్గించింది. స్టీలు తయారీకి ఐరన్​ ఓర్​ చాలా కీలకం. ఐరన్​ ఓర్​ రేట్ల మార్పు ఎఫెక్ట్​ స్టీల్​ తయారీపై నేరుగా పడుతుంది. మాన్సూన్స్​ కారణంగా ప్రొడక్షన్​ తగ్గడం వల్లే ఎన్​ఎండీసీ రేట్లను పెంచినట్లు రిసెర్చ్​ ఫర్మ్​స్టీల్​ మింట్​ వెల్లడించింది. మన దేశంలోనే అతి పెద్ద ఐరన్​ ఓర్​ ప్రొడ్యూసర్​గా ఎన్​ఎండీసీ పేరుపొందిన విషయం తెలిసిందే. దేశీయ ఐరన్​ ఓర్​ అవుట్​పుట్​లో 17 శాతం ఈ కంపెనీ నుంచే వస్తోంది.