పొత్తులుండవు.. ఒంటరిగా పోరాడతా: మమతా బెనర్జీ

పొత్తులుండవు.. ఒంటరిగా పోరాడతా: మమతా బెనర్జీ

తృణమూల్ కాంగ్రెస్ వచ్చే ఏడాది జాతీయ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఒంటరిగా పోరాడుతుందని పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. సీపీఎం, కాంగ్రెస్‌లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ పడుతుందని తేల్చి చెప్పారు. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల వ్యతిరేక ప్రమానాలపై దృష్టి సారించిన మమత..  బీజేపీని ఓడించాలనుకునే వారు తమకు ఓటేస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. ‘ఈ త్రివిధ శక్తులతో కలిసి పోరాడాలంటే తృణమూల్ కాంగ్రెస్ చాలు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత సీన్ రిపీట్ అవుతుంది. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద’ని ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో కేసీఆర్, బీఆర్ ఎస్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలను కున్న కేసీఆర్ కు మొదట మమత మద్దతునిచ్చారు. బీఆర్ ఎస్ తో పొత్తుకు  ఓకే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీపై సమరానికి సై అన్నారు. అయితే, మమత తాజా ప్రకటనతో ఈ మాటలన్నీ వట్టి మాటలని తేలిపోయింది. బీజేపీకి గట్టిపోటీనిచ్చే మమత ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయటం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ.