బిల్ కౌంటర్‌లు లేని సూపర్ మార్కెట్

బిల్ కౌంటర్‌లు లేని సూపర్ మార్కెట్

యాప్‌ను స్కాన్ చేసి, లోపలికెళ్లాలి
నచ్చిన వస్తువు తీసుకొని వచ్చేయాలి
బిల్లు ఆటోమేటిక్‌గా మన అకౌంట్‌లో కట్ అయితది
అమెరికాలో తొలి స్టోర్‌ను ప్రారంభించిన అమెజాన్

మనం ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లి.. అన్ని స్టోర్లు తిరిగి షాపింగ్ అంతా పూర్తి చేసి బిల్లింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తుంటాయి. షాపింగ్ చేయడానికి ఎంత టైమ్​ పట్టిందో. . బిల్లింగ్‌కు కూడా కొన్నిసార్లు అంతే టైమ్​పడుతూ ఉంటుంది. దీంతో చాలాసార్లు షాపింగ్ అంటేనే చిరాకు పుడుతూ ఉంటుంది. ఇకపై ఇలాంటి ఇబ్బందులన్నీ తప్పనున్నాయి. ఎందుకుంటే అసలు క్యాషియరే లేని స్టోర్లను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది. అమెరికా సీటెల్‌లో తన తొలి క్యాషియర్ లెస్ అమెజాన్ గో గ్రాసరీ స్టోర్‌ను మంగళవారం ప్రారంభించింది.

అంతా ఆటోమేటిక్ గానే..
ఈ స్టోర్‌లోకి ఎంటర్ కావాలంటే ఎంట్రన్స్ వద్ద ఆటోమేటెడ్ గేట్లకు ఉండే స్కానర్ల దగ్గర అమెజాన్ గో యాప్‌ను స్కాన్ చేయాలి. మనకు ఏదైనా కావాలంటే స్టోర్‌లోని ర్యాకుల్లోంచి దానిని తీసుకుంటే సరిపోతుంది. స్టోర్‌లో ఉండే సెన్సర్లు, కెమెరాలు ఆటోమేటిక్‌గా వాటిని మన ఆన్ లైన్ కార్ట్‌లోకి ఎంటర్ చేసేస్తాయి. ఒకవేళ మనం ఆ
వస్తువును తీసుకోకుండా అక్కడే పెట్టామంటే కార్ట్‌లోంచి దాని పేరు పోతుంది. ఎక్కడి నుంచి తీశామో అక్కడ పెట్టకపోతే మాత్రం మనకు బిల్లు పడిపోతుంది. మనకు ఏమైనా డౌట్లు ఉంటే అక్కడే ఉండే స్టోర్ ఎంప్లాయిస్‌ను అడగవచ్చు. వారి నుంచి క్లారిటీ తీసుకోవచ్చు. ఇది పూర్తిగా గ్రాసరీ స్టోర్. పప్పులు ఉప్పుల లాంటివి.. క్లీనింగ్, వాషింగ్ ఐటమ్స్.. వెజిటబుల్స్, ఫ్రూట్స్, డెయిరీ ప్రొడక్స్ట్, మీట్, సీఫుడ్, బేకరీ ఐటమ్స్ మొదలైనవి ఉంటాయి. ఒక చోట ఆల్కహాల్ సెక్షన్ కూడా ఉంది. ఇందులో బీర్, వైన్ లభిస్తాయి. అయితే మన ఐడీ కార్డ్ చూపిస్తేనే అందులోకి ఎంట్రీ కల్పిస్తారు.

వెయిట్ చేయాల్సిన పనిలేదు..
ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 500కుపైగా అమెజాన్ గో, హోల్ ఫుడ్ స్టోర్లను అమెజాన్ ప్రారంభించింది. అయితే క్యాషియర్ లేని అమెజాన్ గో గ్రాసరీ స్టోర్ మాత్రం ఇదే మొట్టమొదటిది. షాపింగ్ పూర్తయిన తర్వాత మనం క్యాషియర్ దగ్గరకు వెళ్లి బిల్లింగ్ కోసం వెయిట్ చేయాల్సిన పనిలేదు. ఎగ్జిట్ దగ్గర ఉండే ఆటోమేటెడ్ గేట్ దగ్గరకు వెళితే అవి ఓపెన్ అవుతాయి. మన దగ్గర ఉన్న వస్తువులను స్కానర్లు, కెమెరాలు స్కాన్ చేసుకుంటాయి. వెంటనే మనం బయటకు వెళ్లిపోవచ్చు. మన కార్ట్‌లో యాడ్ అయిన ఐటమ్స్‌ను బట్టి మన మెయిల్‌కు బిల్ వస్తుంది. అమెజాన్ గో యాప్ నుంచి దానికి సంబంధించిన అమౌంట్ కట్ అవుతుంది. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ అమెరికాకే పరిమితం కానుంది. ఈ టెక్నాలజీ మన దేశానికి రావాలంటే మాత్రం మరికొన్నేండ్లు పట్టే అవకాశం ఉంది.

బాగున్నా.. భయంగా ఉందంటున్నరు..
అమెజాన్ తెచ్చిన ఈ కాన్సెప్ట్‌పై కొందరు కస్టమర్లు బాగుందంటుంటే .. మరికొందరు మాత్రం డౌట్లు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఒక స్టోర్‌లోకి వెళ్లి కావాల్సినది తీసుకుని, ఎటువంటి లైన్లు లేకుండా బిల్లు కట్టే పని లేకుండా తిరిగి వెళ్లడం అనే కాన్సెప్ట్ చాలా బాగుందని, తనకు ఈ స్టోర్ చాలా కన్వీనియెంట్‌గా ఉందని 36 ఏండ్ల రెక్స్ ఫారెన్డ్ ఆనందం వ్యక్తం చేశాడు. బిల్లింగ్ కోసం వెయిట్ చేసే అవసరం లేదని, కానీ కార్డు వాడటంతో పోలిస్తే ఆటోమేటెడ్ సిస్టంతో కాస్త ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తుందని 23 ఏండ్ల మ్యాడీసన్ నికోల్స్ పెదవి విరిచిది. ఈ కాన్సెప్ట్ ఇంటరెస్టింగ్‌గా ఉందని, అయితే తనకు ఈ కాన్సెప్ట్‌పై నమ్మకం లేదని 73 ఏండ్ల స్టిఫెన్ షెల్డన్ తెలిపాడు. వస్తువు ప్లేస్ మారితే మనకు బిల్లు పడిపోతది కాబట్టి.. ఏదైనా వస్తువును టచ్ చేయాలంటేనే భయంగా ఉందన్నాడు.

For More News..

ప్రపంచంలోనే అత్యంత విలువైన రేస్.. రూ.143 కోట్ల ప్రైజ్ మనీ

ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ ఊళ్లో 400 జతల కవలలు

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

ఇంటర్​ మెమోలో కీలక మార్పులు