ఎన్నికల ప్రచారమేనా : బిర్యానీ లేదు.. మందు లేదు.. డబ్బులు లేవు.. ఖర్చు తగ్గించేసిన నేతలు

ఎన్నికల ప్రచారమేనా : బిర్యానీ లేదు.. మందు లేదు.. డబ్బులు లేవు.. ఖర్చు తగ్గించేసిన నేతలు

కేరళలో ఎన్నికల హీట్ నడుస్తుంది.. మరో ఆరు రోజుల్లో పోలింగ్.. ఏప్రిల్ 26వ తేదీన ఓట్ల పండుగ.. మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారం.. అయినా కేరళలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఎన్నికల ప్రచారం అయితే జరుగుతుంది.. ఊపు మాత్రం లేదు అంటున్నారు.. దీనికి కారణం లేకపోలేదు.. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయంట.. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కనీసం బిర్యానీ కూడా పెట్టటం లేదంట.. డబ్బులు ఇవ్వటం లేదంట.. 

ప్రచారానికి మగాళ్లు వద్దు :

కేరళలోని చాలా నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారంలో మహిళలే కనిపిస్తున్నారంట.. దీనికి కారణం కాస్ట్ కటింగ్ అంట.. అవును.. మగాళ్లను ప్రచారానికి తీసుకొస్తే మందు పోయాలి.. బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి.. డబ్బులు ఇవ్వాలి.. అదే మహిళలు అయితే జస్ట్ 350 నుంచి 450 రూపాయల వరకు చేతిలో పెడితే సరిపోతుంది.. మందు పోయాల్సిన అవసరం లేదు.. బిర్యానీ అడగరు.. అంతేనా.. ప్రచారం అయిపోయిన తర్వాత ఎలాంటి గొడవ చేయరు.. రచ్చ ఉండదు.. మగాళ్లతో పోల్చితే మహిళలను ప్రచారానికి తీసుకెళితే.. 60 శాతం ఖర్చు తగ్గుతుందని భావించిన అభ్యర్థులు.. మహిళలకే ప్రయార్టీ ఇస్తున్నారంట..

ఫస్ట్ టైం కాస్ట్ కటింగ్ వైపు చూపు :

గత ఎన్నికలకు భిన్నంగా.. ఈసారి ప్రచారంలో కాస్ట్ కటింగ్ వైపు అభ్యర్థులు మళ్లటం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుందంటూ కొందరు వ్యాఖ్యానిస్తు్న్నారు. గతంలో మాదిరి ఆదాయం ఉండటం లేదని.. గెలిచినా.. ఓడినా పెట్టిన ఖర్చును రాబట్టుకునే పరిస్థితులు రోజురోజుకు తగ్గిపోతున్నాయని.. అందుకే ప్రచార ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు కొందరు అభ్యర్థులు నేతల దగ్గర ప్రస్తావిస్తు్న్నారంట.. 

ఓ ర్యాలీ చేయాలన్నా.. ఓ సభ పెట్టాలన్నా లక్షలకు లక్షలు ఖర్చవుతుంది.. గతంలో డబ్బులు, బిర్యానీ, మందు అన్నీ కలిపినా 500 రూపాయల్లో అయిపోయేవి.. ఇప్పుడు ఇవన్నీ ఇవ్వాలంటే కనీసంలో కనీసం వెయ్యి రూపాయలు అవుతుందని.. వెయ్యి మందిని తీసుకొచ్చినా.. ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు ఇస్తే 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని.. రోజుకు రెండు, మూడు సభలు పెట్టినా ఓవరాల్ గా 40 లక్షల రూపాయలు అనధికారికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని.. ఖర్చులు బాగా పెరిగాయని.. అందుకే ప్రచారానికి భారీగా కాస్ట్ కటింగ్ చేసినట్లు చెబుతున్నారంట అభ్యర్థులు. 

కేరళ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఇలాగే ఇలాగే ఆలోచిస్తున్నారంట.. ఏమైనా మార్పు మంచికే.. కాకపోతే పెరిగిన ధరలు ఇలా రాజకీయ నేతలను కూడా భయపెట్టటం ఉంది చూడండీ.. అది హైలెట్ కదా అంటున్నారు సామాన్యులు..