కాంటా పెట్టి నెల దాటినా.. వడ్ల పైసలు పడ్తలే..

కాంటా పెట్టి నెల దాటినా.. వడ్ల పైసలు పడ్తలే..
  • జనగామ జిల్లాలో రూ. 128 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • సెంటర్ల చుట్టూ తిరుగుతున్న రైతులు

జనగామ, వెలుగు పంట పండించడం.. వడ్లు అమ్మడం ఒక ఎత్తయితే.. అమ్మిన వడ్ల పైసలు రైతుల చేతికి అందడం మరో ఎత్తయింది. వడ్లు కాంటా వేసేందుకే సెంటర్ల వద్ద రోజుల తరబడి ఎదురుచూసిన రైతులకు... కాంటాలు అయిపోయాక కూడా పైసలు తీసుకునేందుకు ఎదురుచూపులు తప్పడం లేదు. వడ్లు తీసుకున్న మిల్లు ఓనర్లు తరుగుకు ఒప్పుకోవాలని కొర్రీలు పెడుతుండడానికి తోడు.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతులకు పైసలు అందడం లేదు. జనగామ జిల్లాలో కోట్లాది రూపాయలు రైతులకు అందాల్సి ఉంది. వడ్లు అమ్మి నెల రోజులు దగ్గరకొస్తున్నా పైసలు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 128 కోట్లు...

జనగామ జిల్లాలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1.89 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో 2.30 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల వడ్లు సేకరించాలని ఆఫీసర్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నారు. కానీ అకాల వర్షాలతో పెద్దఎత్తున పంట నష్టం జరగడంతో టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 1.90 లక్షలకు కుదించారు. ప్రస్తుతం ఈ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకోవడం కూడా కష్టంగానే ఉంది. జిల్లాలో 195 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయగా ఇప్పటికే 35 సెంటర్లను ఎత్తేశారు. ఇప్పటివరకు 1.11లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొన్నారు. ఇందులో 1.06 టన్నుల వడ్లను మిల్లులకు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా, మరో 4,800 టన్నులను తరలించాల్సి ఉంది. సుమారు 21,957 మంది రైతుల వద్ద కొన్న వడ్లకు సంబంధించి రూ. 229 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.101 కోట్లు రైతుల అకౌంట్లలో డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా, ఇంకా రూ. 128 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.

డీఎం వద్దే పెండింగ్​

కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తి కాగానే మిల్లులకు తరలించిన తర్వాత ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రీలో నిర్వాహకులు ఆలస్యం చేస్తున్నారు. వడ్లను మిల్లర్లు దించుకొని ఓకే చెప్పాకే ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోఉన్న తూకం ఆధారంగా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు, మిల్లర్లు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఆ తర్వాత డీఎం ఆఫీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలి. వడ్ల కొనుగోళ్లు ప్రారంభమైన మొదట్లో ఈ ప్రక్రియ అంతా సజావుగానే సాగింది. కానీ ఇటీవల ప్రభుత్వం సరిపోను నిధులు విడుదల చేయకపోవడంతో రైతులకు డబ్బులు అందడం లేదు.

సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులను అడిగితే ‘స్టేటస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఎం పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని చూపిస్తుంది.. ఇయ్యాల్నో రేపో డబ్బులు పడ్తయ్’ అంటూ సమాధానం చెబుతున్నారు. కానీ రోజులు గడుస్తున్నా పైసలు మాత్రం పడడం లేదు. జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు అవసరమైన మేర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపినా డబ్బులు విడుదలలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. మూడు, నాలుగు కోట్లు మాత్రమే విడుదల అవుతుండడంతో ఆఫీసర్లు చేసేదేమీ లేక పైసలు వచ్చినప్పుడే రైతుల అకౌంట్లలో వేస్తున్నారు. 

తరుగుకు ఒప్పుకుంటేనే పైసలు వస్తయంటున్రు 

నాలుగున్నర ఎకరాల్లో వరి సాగు చేసిన. 284 బస్తాల వడ్లను 25 రోజుల కిందనే అమ్మిన. ఇప్పటివరకు పైసలు అకౌంట్ల పడలేదు. పైసలు ఎందుకు లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితున్నయని సెంటరోళ్లను అడిగితే మిల్లు ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడగమని చెప్పిన్రు. అక్కడికి వెళ్తే బస్తాకు 2 కిలోలు తరుగు తీసేందుకు ఒప్పుకుంటేనే పైసలు వస్తాయని చెబుతున్రు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు కట్టేందుకు ఇబ్బంది అయితుంది. పైసలు త్వరగా ఇవ్వాలి.

 బానోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడవి కేశవాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనగామ మండలం

15 రోజులైనా పైసలు రాలే... 

ఎనిమిది ఎకరాల్లో వరి పండిస్తే 431 బస్తాల వడ్లు అయినయ్. 15 రోజుల కింద కాంటాలు అయిపోయినయ్. ఇప్పటివరకు పైసలు అకౌంట్ల పడలేదు. పైకి పంపినమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... ఇప్పుడో... అప్పుడో పడుతయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటున్నరు. పైసలు ఆలస్యం అవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నం. తర్వగా ఇవ్వాలి.

జి. రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెద్దపహాడ్, జనగామ మండలం