ఈ–ఆఫీస్ ఎంప్లాయీస్ కు క్లాసిఫైడ్ ఫైల్స్ వద్దు

ఈ–ఆఫీస్ ఎంప్లాయీస్ కు క్లాసిఫైడ్ ఫైల్స్ వద్దు

న్యూఢిల్లీ: లాక్ డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సెంట్రల్ ఉద్యోగులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. ఈ‌‌–ఆఫీస్ ద్వారా వర్గీకృత (క్లాసిఫైడ్) సమాచారాన్ని నిర్వహించొద్దని ఉద్యోగులను ఆదేశించింది. ఈ–ఆఫీస్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఎంప్లాయీస్ కు కీలకమైన క్లాసిఫైడ్ ఫైల్స్ బాధ్యతలను అప్పగించొద్దని హోం శాఖ నిర్ణయించింది. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ (ఎంహెచ్ఏ)ను సంప్రదించి క్లాసిఫైడ్ ఫైల్స్ రిమోట్ యాక్సెస్ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ ఐసీ) భద్రతా ప్రోటోకాల్ ను అంచనా వేస్తుందని తెలుస్తోంది. ఈ–ఆఫీస్ లో క్లాసిఫైడ్ సమాచారాన్ని నిర్వహించడానికి తగిన మార్గదర్శకాలు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను ప్రతిపాదిస్తుందని సమాచారం. క్లాసిఫైడ్ ఫైల్స్ ఇండిపెండెంట్ కంప్యూటర్స్ లో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి.

మొత్తంగా 75 మంత్రిత్వ శాఖలు ఈ–ఆఫీస్ సేవలను యాక్టివ్ గా ఉపయోగిస్తున్నాయి. అలాగే 57 మినిస్ట్రీలు ఈ–ఆఫీస్ ద్వారానే 80 శాతం కంటే ఎక్కువగా వర్క్ చేస్తున్నాయి. ఎవరికైతే ల్యాప్ టాప్స్ ప్రొవైడ్ చేశారో ఆ అఫీషియల్స్ అధికార వర్క్ ను ఆయా ల్యాప్ టాప్స్ లోనే చేయాలని ఎమ్ హెచ్ఏ స్పష్టం చేసింది. ఆ డివైజ్ లు మాల్ వేర్స్, మెలీషియస్ వెబ్ సైట్స్ నుంచి ప్రొటెక్టెడ్ గా ఉండాలని పేర్కొంది. పర్సనల్ ల్యాప్ టాప్స్ పై పని చేస్తున్న అధికారులు యాంటీ వైరస్ తో స్కాన్స్ చేస్తూ, రెగ్యులర్ అప్ డేట్స్ చేసుకోవాలని వివరించింది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులు తమ పైఅధికారులతో ఫోన్ లో అవేలబుల్ గా ఉండాలని సూచించింది.