కోదాడ పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌పై నెగ్గిన అవిశ్వాసం

కోదాడ పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌పై నెగ్గిన అవిశ్వాసం

కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్ ఆవుల రామారావుపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గింది. గురువారం పీఏసీఎస్‌‌‌‌ కార్యాలయంలో డీసీవో శ్రీధర్ సమక్షంలో మీటింగ్ నిర్వహించారు. సొసైటీలో చైర్మన్‌‌‌‌తో కలిపి మొత్తం13 మంది డైరెక్టర్లు ఉండగా వైస్ చైర్మన్ బుడిగం నరేశ్‌‌‌‌తో సహా 11 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. చైర్మన్ ఆవుల రామారావు గైర్హాజరు అయ్యారు. వీరంతా అవిశ్వానికి మద్దతు తెలిపారు.

తీర్మానం ఫలితాన్ని హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈనెల 30 తర్వాత వెల్లడించనున్నట్లు డీసీవో శ్రీధర్ తెలిపారు. కాగా, కొత్తగా చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకొనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  డైరెక్టర్లు గుండెపునేని ప్రభాకర్ రావు,శిరం శెట్టి వెంకటేశ్వర్లు, సోమపంగు పార్వతి, గుజ్జ బాబు, వట్టె సీతారామయ్య, బోర్ర చంద్రమౌళి బానోతు గోబ్రా, శెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

దేవరకొండ పీఏసీఎస్ ​చైర్మన్‌‌‌‌పై అవిశ్వాసానికి సిద్ధం

దేవరకొండ, వెలుగు: దేవరకొండ పీఏసీఎస్ చైర్మన్​ పల్లా ప్రవీణ్​రెడ్డిపై అవిశ్వాసం పెట్టాలని డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం 9 మంది డైరెక్టర్లు నల్గొండలో డీసీవో ను కలిసి వినతిపత్రం అందజేశారు.  ఈ సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా 9 మంది  అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. చైర్మన్​ పల్లా ప్రవీణ్​రెడ్డి  ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని, ధాన్యం కొనుగోళ్లలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడని డైరెక్టర్లు ఆరోపించారు.