జవహర్‌నగర్ వెలుగు : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌పై ఈ నెల19న అవిశ్వాస తీర్మానం ఉంటుందని మేడ్చల్ కలెక్టర్ ప్రకటించారు. మేయర్ మేకల కావ్యకు వ్యతిరేకంగా గత నెలలో 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసును కలెక్టర్‌కు అందించారు. గతేడాది దరఖాస్తు చేసినా సరైన పత్రాలు అందించకపోవడంతో అవిశ్వాసం పెండింగ్ పెట్టారు.
గత నెల 20న కార్పొరేటర్లు మరోసారి పత్రాలతో కలెక్టర్ కు అందజేయగా.. తేదీ ఖరారు చేసి ప్రకటించారు. ఇప్పటికే 20 మంది కాంగ్రెస్ మద్దతుదారులైన కార్పొరేటర్లను క్యాంపు రాజకీయాల నిమిత్తం బాపట్లకు తరలించారు. మేయర్ మేకల కావ్యకు మద్దతుగా ప్రస్తుతం 7 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం వీగుతుందా.. నెగ్గుతుందా అనేది ఆ రోజు తేలిపోనుంది.
