No-confidence Motion : దేశ చరిత్రలో 28వ అవిశ్వాస తీర్మానం

No-confidence Motion :  దేశ చరిత్రలో 28వ అవిశ్వాస తీర్మానం

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్ష పార్టీలు. దీంతో దేశ రాజకీయ చరిత్రలో ఇది 28అవిశ్వాస తీర్మానం. దేశంలో మొదటిసారిగా 1963లో కేంద్రంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాసలను ఎదురుకుని అన్నింట్లో విజయం సాధించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి , పివి నరసింహారావు (మూడు చొప్పున), మొరార్జీ దేశాయ్ (రెండు), జవహర్‌లాల్ నెహ్రూ , రాజీవ్ గాంధీ , అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్  సింగ్ ఒకొక్కసారి ఎదురుకున్నారు.   1999లో వాజ్‌పేయి ఒక ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు

ALSO READ :కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే.. అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదు

దేశ రాజకీయ చరిత్రలో  గత25 ఏళ్లలో మూడు అవిశ్వాస తీర్మానాలు 

  • 1993 జూలైలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు  అవిశ్వాసాన్ని ఎదురుకున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై విపక్షాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అందులో ఆయన నెగ్గారు.  
  • ఇక 1999లో ఒక ఓటు తేడాతో వాజ్ పేయి అధికారం కోల్పోయారు. 
  • 2009 జూలైలో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ మాజీ ప్రధాని మన్మోహన్  సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఆయన ప్రభుత్వం పూర్తి మెజార్టీతో నెగ్గింది.