ఖర్గేతో మితృత్వమే తప్ప శతృత్వం లేదు: శశిథరూర్

ఖర్గేతో మితృత్వమే తప్ప శతృత్వం లేదు: శశిథరూర్

గాంధీ ఫ్యామిలీని లాగడం సరికాదు: ఖర్గే, శశిథరూర్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరిని గెలిపించినా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అభ్యర్థి శశిథరూర్ అన్నారు. తనకు ఖర్గేతో మితృత్వం తప్ప శతృత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే పార్టీలో ఖర్గేకు మంచి గౌరవం లభిస్తోందని.. ఆయనలా గౌరవం తనకు దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఆయా రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు అనేక రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు మంచిగా స్వాగత సత్కారాలు చేస్తే... తాను వెళ్లినప్పుడు అలా జరగలేదని, కొన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు తాను వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడం కొంత బాధించిందని శశిథరూర్ తెలిపారు. 

కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గాంధీ ఫ్యామిలీ ఖర్గే పేరును ప్రతిపాదించిందని వస్తున్న వార్తలపై ఖర్గేతోపాటు శశిధరూర్ స్పందించారు. ఎన్నికల్లోకి గాంధీ ఫ్యామిలీని లాగడం సరికాదని  ఖర్గే, శశిథరూర్ అన్నారు.  కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇరువురూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 17వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. 19వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించనున్నారు. దేశ వ్యాప్తంగా 9300 కాంగ్రెస్ నేతలు అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రదేశం నుండే ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.