మాస్కులు లేకుంటే సరుకులియ్యం

మాస్కులు లేకుంటే సరుకులియ్యం
  • ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలో షాప్ ఓనర్ల కండిషన్

బలరాంపూర్ (యూపీ): మాస్కులు పెట్టుకోకుంటే నిత్యావసర సరుకులు ఇచ్చేది లేదని ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలో షాప్ ల ఓనర్లు తెగేసి చెబుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్కులు పెట్టుకోవాల్సిందేనని, అధికారుల ఆదేశాల మేరకు ఈ కండిషన్ ను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు సోషల్ డిస్టెన్స్ ను స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నామని బలరాంపూర్ ఎస్పీ దేవరంజన్ వర్మ అన్నారు. “మాస్కులు పెట్టుకోనివారికి సరుకులు ఇవ్వొద్దని చెప్పాం. మెడికల్, గ్రోసరీ స్టోర్స్, పెట్రోల్ పంపులు, గ్యాస్ ఏజెన్సీలు, విత్తనాల దుకాణాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాం. ఈ నిబంధన ఉల్లంఘించే షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన అన్నారు. మాస్కులు పెట్టుకోని 11 మందిపై కేసులు పెట్టామని చెప్పారు.