ఇంటర్ విద్యార్థులకు కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్

ఇంటర్ విద్యార్థులకు కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్‌‌‌‌డౌన్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాలు, జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. షాపులు, కంపెనీలు, విద్యా సంస్థలు.. ఒకటేమిటి అన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని అటు తల్లిదండ్రుల్లోనూ.. ఇటు విద్యార్థుల్లోనూ ఆందోళన నెలకొంది. అయితే అలా బాధపడతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు చత్తీస్ ఘర్ ప్రభుత్వం భరోసానిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను ఎటువంటి పరీక్ష లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ ప్రభుత్వ విద్యాశాఖ డైరెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ సంక్రమణను నియంత్రించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 19 నుండి అన్ని పాఠశాలలను మూసివేసింది. అంతేకాకుండా.. వివిధ పరీక్షలను సైతం వాయిదా వేసింది. ఆ తర్వాత ప్రధాని లాక్ డౌన్ ఆదేశాల మేరకు మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో 1 నుండి 9 తరగతి మరియు 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. ఇకముందు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. దాంతో 1వ తరగతి నుండి 9వ తరగతి మరియు 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ఆదేశించారు.

For More News..

లాక్‌‌‌‌డౌన్‌ టైంలో జనాలు ఏం చేస్తున్నారో తెలుసా..

దేశంలో ఒక్కరోజే 200లకు పైగా పాజిటివ్ కేసులు

ఫోన్ చేస్తే ఫ్రీగా ఫుడ్

ఇయ్యాల్టి నుంచే రేషన్ పంపిణీ