No Kings protest : అమెరికాలో నో కింగ్స్ ఉద్యమం.. ప్రపంచ వ్యాప్తంగా 2వేల 600 నగరాలకు పాకింది.. ఎందుకీ నిరసనలు?

No Kings protest : అమెరికాలో నో కింగ్స్ ఉద్యమం.. ప్రపంచ వ్యాప్తంగా 2వేల 600 నగరాలకు పాకింది.. ఎందుకీ నిరసనలు?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ కు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నో కింగ్స్​ నినాదాలు మార్మోగాయి. నో కింగ్స్​ నినాదంతో జరిగిన ఈ నిరసనలు లండన్​, మాడ్రిడ్​, బార్సిలోనా తో సహా ప్రపంచ వ్యాప్తంగా 2వేల 600 కంటే ఎక్కువ నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకుంటున్న నిర్ణయాలు,  సంస్కరణలతో  ఓ రేంజ్​విరుచుకుపడ్డారు. 

ట్రంప్​విధానాలపై ప్రపంచ దేశాలతోపాటు అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ట్రంప్​ తీరుకు ఆగ్రహించిన ప్రజలు నోకింగ్స్​ నినాదంతో శనివారం ( అక్టోబర్​ 18) అమెరికా వ్యాప్తంగా ఆందోళనలుచేపట్టారు. అమెరికా వ్యాప్తంగా 2వేల 600 నగరాలతోపాటు ఐరోపా దేశాల్లోనూ ఆందోళనకారులకు మద్దతుగా నిరసనలు వెల్లువెత్తాయి. ట్రంప్​  కు వ్యతిరేకంగా ఉత్తర వర్జీనియాలో ఆందోళనకు వాషింగ్టన్, డిసి వైపు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది వందలాది మంది నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. 

ట్రంప్​ రెండోసారి అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో వలసలపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకున్నారు. సంస్కరణల పేరుతో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలో డాగీని ఏర్పాటు చేసిన వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. జన్మతః పౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల రక్షణ, అక్రమ వలసలు తదితర అంశాల్లో కీలక మార్పులు చేశారు. అమెరికా వ్యాప్తంగా వలసదారులపై అధికారుల సోదాలు వివాదాస్పదంగా మారాయి.  

దీనిపై స్థానికంగా నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాల్లో  నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్‌ యంత్రాంగం మోహరించడం ఆందోళనలకు మరింత పెరిగేలా చేశాయి.  ట్రంప్‌ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా  నో కింగ్స్‌ పేరుతో నిరసనలు మొదలుపెట్టారు. అమెరికాలో రాజులు లేరని, అవినీతి పాలన సాగుతోందని ,  ట్రంప్​ క్రూరత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని  ఆందోళనకారులు చెబుతున్నారు.