సీఏఏ అమలుచేస్తం.. ఎవరూ ఆపలేరు : అమిత్ షా

సీఏఏ అమలుచేస్తం.. ఎవరూ ఆపలేరు : అమిత్ షా

కోల్ కతా :  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయకుండా ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరని కేంద్ర మంత్రి అమిత్ షా  అన్నారు. అది చట్ట మని దానిని అమలుచేసి తీరుతామ ని తెలిపారు. బుధవారం కోల్​కతా లో బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచా రం షురూ చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదార్ల విషయంపై  పార్లమెంటును ఓసారి దీదీ అడ్డుకున్నారు, కానీ ఇప్పుడు సీఏఏపై మౌనం వహిస్తున్నారని చెప్పారు. 

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని మెజార్టీ  స్థానాల్లో గెలిపిం చాలని కోరారు. 2026  అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారం లోకి వస్తుందని జోస్యం చెప్పారు.  అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాట్లు చోటు చేసుకోలే దని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితం గా బెంగాల్​లో చొరబాట్లు ఏమాత్రం తగ్గలేదని వెల్లడించారు. చొరబాటు దార్ల కారణంగా రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. దీదీ సర్కారును గద్దె దించి అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు.