ఈ భూమ్మీద నా కంటే అదృష్టవంతులు ఎవరూ లేరు : రామ్​లల్లా రూపకర్త యోగిరాజ్

ఈ భూమ్మీద నా కంటే అదృష్టవంతులు ఎవరూ లేరు : రామ్​లల్లా రూపకర్త యోగిరాజ్

  అయోధ్య : ఈ భూమ్మీద తన కంటే అదృష్టవంతులు ఎవరూ లేరని రామ్ లల్లా విగ్రహ రూపకర్త యోగిరాజ్ తెలిపారు. ఈ పని కోసం రాముడే తనను ఎంచుకున్నాడని సోమవారం ఆయన చెప్పారు. “రాముడు అన్ని కష్ట సమయాల్లో నన్ను, నా కుటుంబాన్ని కాపాడాడు. ఈ శుభప్రదమైన పని కోసం రాముడే నన్ను ఎంచుకున్నాడు. విగ్రహాన్ని కచ్చితత్వంతో చెక్కడానికి నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఈ రోజు నా జీవితంలోనే ఎంతో విలువైనది. ఈ భూమ్మీద నా కంటే అదృష్టవంతులు ఎవరూ లేరూ” అని యోగిరాజ్ పేర్కొన్నారు.