కెప్టెన్సీ రికార్డులలో ధోనీతో ఎవరూ సరితూగలేరు : గౌతమ్ గంభీర్

కెప్టెన్సీ రికార్డులలో ధోనీతో  ఎవరూ సరితూగలేరు :  గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై  మాజీ ఓపెనర్  గౌతమ్ గంభీర్  ప్రశంసలు కురిపించాడు .  ఇండియాకు చాలా మంది కెప్టెన్లు వచ్చారు.. వస్తారు కానీ అతని కెప్టెన్సీని ఎవరూ సాటి రాలేరని అన్నాడు, ధోనీ తన కెప్టెన్సీ కెరీర్ లో మూడు ఐసీసీ టోర్నీలను గెలిచాడని అంతకంటే గొప్పది ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.  ధోనీ గురించి స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన వీడియోలో గంభీర్ ఈ మాటలు చెప్పాడు. జట్టు కోసం బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానాన్ని మహీ త్యాగం చేశాడని ఇటీవల గంభీర్ అన్నాడు. జట్టు కోసం రికార్డులను ధోనీ పట్టించుకోలేదని పొగిడాడు.

2007 లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన ధోనీ... ఆ ఏడాది జరిగిన ఐసీసీ టీ20వరల్డ్ కప్ ను టీమిండియా ధోనీ కెప్టెన్సీలో సొంతం చేసుకుంది.  ఇక  2011లో వన్టే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను ధోనీ సారథ్యంలోనే  టీమిండియా గెలుచుకుంది.  2020 ఆగస్టు 15న  అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు ధోనీ. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతూ  చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు  నాయకత్వం వహిస్తున్నాడు.

మరోవైపు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. దీంతో టీమిండియా హాట్ ఫేవరెట్‍గా ఉంది. రోహిత్‍సేన ఈ సారి వరల్డ్ కప్ గెలుస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి.