అటెండెన్స్ లేదని ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసేందుకు నో పర్మిషన్

అటెండెన్స్ లేదని ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసేందుకు నో పర్మిషన్

కరీంనగర్‌‌‌‌‌‌‌‌టౌన్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ లా కాలేజీలో ఎల్ఎల్‌‌‌‌‌‌‌‌బీ ఫస్టియర్ విద్యార్థులను ఇంటర్నల్ ఎగ్జామ్ రాసేందుకు యూనివర్సిటీ అధికారులు నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా లా కాలేజీ ప్రారంభమైన విషయం తెలిసిందే. లా సెట్ ద్వారా సుమారు 90 మంది ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. వీరికి మంగళవారం ఫస్ట్ సెమిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నల్స్‌‌‌‌‌‌‌‌ ప్రారంభమయ్యాయి.  

ఉదయం కాలేజీకి చేరుకున్న స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌లో 50 మందికి అటెండెన్స్ లేదనే కారణంతో సిబ్బంది అడ్డుకున్నారు. కేవలం 40 మందినే అనుమతించారు. దీంతో గేటు బయట విద్యార్థులు ఆందోళనకు సిద్ధపడగా.. అప్పటికే క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో కొందరు విద్యార్థులు పలుమార్లు ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ సుజాత, రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ను కలసి ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌కు అనుమతించాలని కోరారు. అయినా అటెండెన్స్ లేని కారణంగా.. వీసీ ఆదేశాల మేరకు అనుమతించడం లేదని వారు స్పష్టం చేశారు.

క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో హాస్టల్ ఉంటుందనే భరోసాతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ జాయిన్ అయ్యామని, తీరా ఇక్కడ హాస్టల్ లేదని, తాము ఎక్కడ ఉండాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులమైన తాము బయట రూములు తీసుకుని ఉంటూ చదివే పరిస్థితి లేదని, వెంటనే హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరారు.