Vijay Deverakonda: 'కింగ్‌డమ్'‌కు ప్రీమియర్ షో కష్టాలు? ప్రభుత్వ నిర్ణయంపై డైలమా!

Vijay Deverakonda:  'కింగ్‌డమ్'‌కు ప్రీమియర్ షో కష్టాలు? ప్రభుత్వ నిర్ణయంపై డైలమా!

టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ నటించిన భారీ చిత్రం 'కింగ్‌డమ్' (Kingdom) జూలై 31, 2025 గురువారం గ్రాండ్‌గా విడుదల కానుంది.  ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమా ప్రీమియర్‌ షోల విషయంలో అభిమానులు, చిత్ర బృందం మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. సాధారణంగా పెద్ద సినిమాలకు విడుదల తేదీకి ఒక రాత్రి ముందు గ్రాండ్ ప్రీమియర్ షోలు (Grand Premiere Shows) వేయడం ఆనవాయితీ. 'కింగ్‌డమ్' విషయంలోనూ అభిమానులు ఇదే ఆశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌,  తెలంగాణలో  ప్రీమియర్స్ నిర్వహణపై అస్పష్టత నెలకొంది.

 ప్రీమియర్స్‌కు అనుమతి లేదా?
అయితే, ప్రీమియర్స్ గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు జారీ చేసిన టికెట్ ధరల పెంపు ఉత్తర్వులలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది అభిమానుల్లో, ముఖ్యంగా థియేటర్ల యజమానుల్లో, నిర్మాతల్లో పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) వంటి చిత్రాలకు ప్రీమియర్స్ కోసం రూ. 600 పెంచుకునే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, 'కింగ్‌డమ్' విషయంలో అలాంటి ప్రస్తావనే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

దీంతో, 'కింగ్‌డమ్'కు ప్రీమియర్స్ టికెట్ రేట్లు పెరిగే  అవకాశం కనిపించడం లేదు. పాత రేట్స్ ప్రకారం, రూ. 150కే ప్రీమియర్స్ వేయాల్సి వస్తే, అది నిర్మాత నాగవంశీకి (Nagavamsi), థియేటర్లకు భారీ నష్టాలను తెచ్చిపెడుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ ఆదాయం చాలా కీలకం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే, 'కింగ్‌డమ్'కు ప్రీమియర్ షోలు ఉండే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో మూవీ టీమ్ ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాలి. ఒకవేళ ప్రీమియర్స్ రద్దయితే, తమ అభిమాన హీరో సినిమాను ముందుగా చూడాలనుకునే అభిమానులకు ఇది గట్టి షాకే అవుతుంది. నాగవంశీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని సంతరించుకుంది.

.

 

అడ్వాన్స్ సేల్స్ దుమ్మురేపుతున్న 'కింగ్‌డమ్'!
 ప్రీమియర్ షోలపై డైలమా ఉన్నప్పటికీ 'కింగ్‌డమ్' అడ్వాన్స్ సేల్స్ (Advance Sales) దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో (Hyderabad) సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హైదరాబాద్  అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ ఇప్పటికే రూ. 1 కోటిని దాటింది. దాదాపు 45శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. యూఎస్‌ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్: అమెరికాలో 'కింగ్‌డమ్' హవా కొనసాగుతోంది. 235 లొకేషన్లలో, 555 షోలకు గాను 256,527 డాలర్లు (సుమారు రూ. 2.14 కోట్లు) వసూలు చేసింది. ఇప్పటివరకు 13,605 టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ సేల్స్ ఇప్పటివరకు  మొత్తం సుమారు రూ. 2.34 కోట్లుమార్కును చేరినట్లు సమాచారం..

 

గౌతమ్ తిన్ననూరి ( Gautham Tinnanuri )దర్శకత్వం వహించారు . పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను హిందీలో 'సామ్రాజ్య' అనే కొత్త టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో 'ఎన్టీఆర్', తమిళంలో 'సూర్య', హిందీలో ' రణ్ బీర్ కపూర్' వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే  నటించింది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాలకాలపై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. హై ఆక్టేన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.  జూలై 31న  భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిక్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.