Nithiin : 'తమ్ముడు' OTT లో రిలీజ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nithiin :  'తమ్ముడు' OTT లో రిలీజ్..  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో యువ కథానాయకుడు నితిన్ ( Nithiin) నటించిన చిత్రం 'తమ్ముడు' ( Thammudu ) జూలై 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.  దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 8.19 కోట్లు మాత్రమే వసూలు చేసిందని సమాచారం. అయితే OTT రైట్స్ పుణ్యమా అని కొంత ఊరట లభించిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

నితిన్ నటించిన ఈ తమ్ముడు సినిమాలో ఎమోషనల్ టచ్ , స్టార్ పవర్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను పూర్తిగా కనెక్ట్ కాలేకపోయింది. ఓటీటీ అరంగ్రేటంతో ఆ లోటును భర్తీని పూర్తి చేసుకోవచ్చని మూవీ మేకర్స్ లో కొత్త ఆశలు చిగురించాయి. దీంతో  ఈ మూవీని  నెట్‌ఫ్లిక్స్ ( Netflix ) లో ఆగస్టు 1న విడుదల చేయబోతున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం బాషల్లో  స్ట్రీమింగ్ కానుంది. 

చిన్నతనంలో విడిపోయిన ఒక సోదరి, సోదరుడు సంవత్సరాల తర్వాత ఎలా తిరిగి కలుసుకుంటారు. బంధాలు, భావోద్వేగాలు చుట్టూ 'తమ్ముడు' కథ కేంద్రీకృతమై ఉంటుంది.  భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. అయితే ఈ మూవీ విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. నటీనటుల నటనను కొందరు ప్రశంసించినప్పటికీ, సినిమా కథనం, దర్శకత్వంపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.  సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు కృత్రిమంగా ఉన్నాయని, కొన్ని చోట్ల టీవీ సీరియల్స్‌ను తలపించాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సినిమాకు వచ్చిన ప్రతికూల 'వర్డ్-ఆఫ్-మౌత్' బాక్సాఫీస్ వసూళ్లు పడిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచిందని భావిస్తున్నారు. 

 

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ 'తమ్ముడు' మూవీలో నిత్ సరసన సప్తమి గౌడ నటించింది.  కీలక పాత్రలో లయ, విలన్ గా సౌరభ్ సచ్ దేవా కనిపించారు.  ఈ సినిమాకు సమీర్ రెడ్డి, సేతు, కె.వి.గుహన్ సినిమాటోగ్రఫీ అందించారు.  ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న నితిన్ కు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఆయన కెరీర్ పై తీవ్ర పడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 'ఎల్లమ్మ' చిత్రంలో నటిస్తున్నారు. బలగం చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.