ఇప్పట్లో పెట్రోల్‌ను GST పరిధిలోకి తేచ్చేది లేదు : కేంద్రం

ఇప్పట్లో పెట్రోల్‌ను GST పరిధిలోకి తేచ్చేది లేదు : కేంద్రం

పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, గ్యాస్‌ వంటి పెట్రోఉత్పత్తులను GST పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన ఇప్పట్లో లేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీనిపై GST కౌన్సిల్‌ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని లోక్‌సభ వేదికగా రాతపూర్వక సమాధానమిచ్చింది. సరైన సమయంలో దీనిని పరిగణలోకి తీసుకునే అవకాశముందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌. పన్నుల తగ్గింపు ప్రతిపాదనకు కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే.. రాష్ట్రాలు కూడా దీన్ని లెక్కలోకి తీసుకోవాలన్నారు.