రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే.. ఎక్క‌డెక్క‌డ ఏయే స‌డ‌లింపులు

రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే.. ఎక్క‌డెక్క‌డ ఏయే స‌డ‌లింపులు

రాష్ట్రంలో మే 29 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం సూచించిన ప్ర‌కారం స‌డ‌లింపులు అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ల‌లో భౌతిక దూరం పాటిస్తూ అన్ని ర‌కాల కార్య‌క‌లాపాలు చేసుకోవ‌చ్చ‌న్నారు. కేంద్రం రెడ్ జోన్ల‌లోనూ అన్ని ర‌కాల యాక్టివిటీస్ కి అనుమ‌తి ఇచ్చింద‌ని అయితే, మ‌రింత క‌ఠినంగా ఉంటే రాష్ట్రంలో క‌రోనా నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌గ‌లుగుతామ‌ని, రాష్ట్రంలో రెడ్ జోన్స్ లో ఎటుంటి స‌డ‌లింపులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా ప‌రిస్థితులు, లాక్ డౌన్ అమ‌లుపై దాదాపు ఏడు గంట‌ల పాటు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ చ‌ర్చించింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను సీఎం స్వ‌యంగా మీడియాకు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఆరు రెడ్ జోన్స్ మాత్ర‌మే ఉన్నాయని, ఈ ఆరు జిల్లాలో మాత్రం ఎటువంటి స‌డ‌లింపులు ఉండ‌బోవ‌ని చెప్పారు. నిర్మాణ ప‌నుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తామ‌న్నారు. సామాజిక దూరం పాటించకపోతే అన్ని జోన్ల‌లోనూ మళ్లీ పూర్తిగా బంద్ చేస్తామ‌ని హెచ్చరించారు.

రెడ్‌ జోన్ జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల

గ్రీన్‌ జోన్ జిల్లాలు: పెద్దపెల్లి, నాగర్ కర్నూల్‌, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి

లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ స‌డ‌లింపులివే:

  • రెడ్ జోన్ లో నిత్యావసర షాపులు ,సిమెంట్, స్టీల్, హర్డ్ వేర్ షాపులు,, నిర్మాణ రంగ ప‌నులు, వ్యవసాయ సంబంధ పనిముట్ల షాపులు మాత్ర‌మే ఓపెన్ అవుతాయి.
  • హైదరాబాద్ లో ఎటుంటి స‌డ‌లింపులు ఉండ‌వు. 15 వతేది రివ్యూ చేసి.. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి హైదరాబాద్ లో ఎలాంటి స‌డ‌లింపులు ఇవ్వాల‌న్న‌ది నిర్ణయం చెబుతామ‌న్నారు సీఎం కేసీఆర్.
  • గ్రామాలలో గ్రీన్, ఆరెంజ్ జోన్ లో అన్ని రకాల షాప్ లు నడుస్తాయి.ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు షాప్ లు నడుస్తాయి.
  • రాత్రి 7 గంటల నుండి పొద్దున 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.
  • మున్సిపల్ టౌన్లలో 50 శాతం మాత్రమే షాప్ లు నడుస్తాయి.
  • ప్రైవేట్ ఆఫీసుల్లో 33 శాతం సిబ్బందితో పనులు చేసుకోవ‌చ్చు.
  • స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 100 శాతం నడుస్తాయి.
  • ఇసుక మైనింగ్ బుధ‌వారం నుంచి వంద శాతం నడుస్తాయి.
  • వాహన రిజిస్ట్రేషన్లు కూడా మొద‌ల‌వుతాయి.