
హైదరాబాద్, వెలుగు: ధూప దీప నైవేద్యం స్కీమ్ కింద పనిచేస్తున్న సుమారు 2600 మంది అర్చకులకు 6 నెలలుగా జీతాలు రాట్లేదని ధూప దీప నైవేద్య అర్చక సంఘం స్టేట్ ప్రెసిడెంట్ సతీశ్ శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అబిడ్స్, బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషనరేట్లో కమిషనర్ అనిల్ కుమార్ను కలిసి వినతిపత్రం అందచేశారు. 6 నెలల నుంచి జీతాలు రాకపోవటంతో అర్చకుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని కమిషనర్ కు తెలిపారు. అర్చకులకు ఐడీ కార్డులు ఇవ్వాలని కోరారు.