సర్కార్ డిగ్రీ కాలేజీల్లో నో స్పాట్ అడ్మిషన్స్.. ఈసారి కూడా ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకే చాన్స్

సర్కార్ డిగ్రీ కాలేజీల్లో నో స్పాట్ అడ్మిషన్స్.. ఈసారి కూడా ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు ఈ ఏడాది కూడా అవకాశం కల్పించలేదు. కేవలం 630 ప్రైవేటు, 29 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు మాత్రమే స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనుమతించింది. 119 ప్రభుత్వ, 37 అటానమస్, వర్సిటీ కాలేజీలకు స్పాట్ అడ్మిషన్ అవకాశం నిరాకరించింది. దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్లు ఈ నెల 25 నుంచి ఆగస్టు 6 వరకు కొనసాగనున్నాయి. ఇది పూర్తయిన తర్వాత ఆగస్టు 11, 12 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. గతంలో దోస్త్ అడ్మిషన్లలో నాన్-లోకల్ కోటా ఉండేది. ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే  పరిమితమయ్యాయి.