రెండేళ్లుగా కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు లేవ్

V6 Velugu Posted on Jun 13, 2021

శ్రీనగర్: జమ్మూ కశ్మర్‌లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత రెండేళ్లుగా లోయలో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగలేదన్నారు. చొరబాట్లు, తిరుగుబాట్లు, బాంబు పేలుళ్లు లాంటి ఇతర టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఒకట్రెండు చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే లోయలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. కాగా, రెండ్రోజుల కింద నార్త్ కశ్మీర్‌లోని సొపోర్ టౌన్‌లో టెర్రరిస్టు అటాక్‌ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతోపాటు మరో ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ దాడికి తెగబడింది లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాదులేనని జమ్మూ కశ్మీర్ పోలీసులు కన్ఫర్మ్ చేశారు. 

Tagged Jammu and Kashmir, Minister of State (Home) G Kishan Reddy, Terrorist activity, Infiltration, Insurgency, Bomb explosions, J&K Police, Lashkar-e-Taiba operatives 

Latest Videos

Subscribe Now

More News