Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్ కు నిరాశే

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్ కు నిరాశే

2025 నోబెల్​ శాంతి బహుమతి శుక్రవారం(అక్టోబర్​10) ప్రకటించారు. 2025 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనుజులాకు చెందిన కొరినా మచాడోకు లభించింది. అయితే నోబెల్​ శాంతి బహుమతిపై ఎంతగానో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​ నిరాశే మిగిలింది. గతమూడు నెలలుగా ట్రంప్ 2025 శాంతి బహుమతి తనకే వస్తుందని బాగా ప్రచారం చేసుకున్నారు. ​

ఈ క్రమంలో శుక్రవారం ప్రకటించిన నోబెల్​ శాంతి బహుమతి విన్నర్​ పై అందరి దృష్టి నిలిచింది. ట్రంప్​ కు కొంత మద్దతు ఉన్నప్పటికీ వెనుజులా రాజకీయ వేత్త, వెనుజుల ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం కృషి చేసిన కొరినా మచాడోను నోబెల్​ శాంతి బహుమతి వరించింది.నోబెల్​ శాంతి బహుమతికి గ్రహీతలకు బంగారు పతకం, డిప్లోమా, రూ. 8.7 కోట్ల నగదు బహుమతిని అందిస్తారు. బహుమతి నగదును నోబెల్​ ఫౌండేషన్​సమకూరుస్తుంది.  

ట్రంప్‌ శాంతి బహుమతికి అర్హుడేనా?

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం, పలు దేశాలలో సంఘర్షణల నడుమ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. నోబెల్ శాంతి బహుమతికి మొత్తం 338 ఎంట్రీలు రాగా... నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ వాటిని పరిశీలించిన విజేతను ఎంపిక చేసింది. 

గత నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను ఏడు యుద్ధాలు ఆపాను.. ఏ అధ్యక్షుడుగానీ లేదా ఏ ప్రధాన మంత్రిగానీ ఇలా చేయలేదు’ .. ఈ ఏడాది నాకు నోబెల్​ శాంతి బహుమతి వస్తుందని అని అందరూ అంటున్నారు. కాంబోడియా-థాయ్‌లాండ్, కొసావో-సెర్బియా, కాంగ్-రువాండా, భారత్- పాకిస్థాన్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్టు-ఇథియోపియా, అర్మేనియా-అజర్‌బైజాన్ సహా ఏడు యుద్దాలు తనవల్లే ఆగిపోయాయని ట్రంప్​ తనను తాను శాంతి బహుమతికి ప్రమోట్ చేసుకున్నాడు.   

అంతర్జాతీయ శాంతికి చేసిన కృషికి చారిత్రాత్మకంగా నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసినప్పటికీ, ఈ ప్రకటన దాని అనూహ్య స్వభావం కారణంగా తరచుగా చర్చకు దారితీస్తుంది. ఈ ఏడాది డోనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఈ జాబితాలో ఉండటంతో ప్రపంచ దృష్టి మరోసారి నార్వేజియన్​ కమిటీ వైపు మళ్లింది. 

►ALSO READ | నోబెల్ శాంతి బహుమతి మరియా కొరినా మచాడో : వెనిజులా మహిళకు దక్కిన గౌరవం

అక్టోబర్​ 7న నోబెల్​ శాంతి బహుమతి అందించాలని నోబెల్​ కమిటీకి ట్రంప్​ తరపున బందీలు ,ఉగ్రవాద బాధితుల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించే హోస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం విజ్ణప్తి చేసింది. ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న వారంతా కేవలం శాంతి గురించే అనర్గళంగా మాట్లాడారు.. ట్రంప్​ అలా మాట్లాడలేనప్పటికీ.. శాంతిని సాధించారు.. స్థాపించారు.. లెక్కలేనన్నీ ప్రాణాలు కాపాడారు అని ఫోరం నోబెల్​ కమిటీకీ లేఖలో రాసింది. ఇలా  ఎందరో ట్రంప్​ కు నోబెల్​ పీస్​ ప్రైజ్​ఇవ్వాలని మద్దతు ఇచ్చినప్పటికీ ఫలితం రాలేదు. 

ట్రంప్​ కు నోబెల్​ శాంతి బహుమతి ఇవ్వాలని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు కూడా సిఫారసు చేశారు. తన మద్దతును నోబెల్​ కమిటి తెలిపారు. జూలైలో వాషింగ్టన్​ డీసీ పర్యటనకు వచ్చిన బెంజిమన్​ నెతన్యాహు నోబెల్​ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ను నామినేట్​ చేసినట్లు చెప్పారు. ఈ వార్తను  ట్రంప్​ తెలియజేయనప్పటికీ నోబెల్​ కమిటీకి లేఖ రాశారు. 

గతంలో కూడా ట్రంప్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు కానీ ఎంపిక కాలేదు. 2020లో ఇజ్రాయెల్ ,అరబ్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పే అబ్రహం ఒప్పందాలకు మధ్యవర్తిత్వం వహించినపుడు  US ప్రతినిధి క్లాడియా టెన్నీ, RN.Y.లు ట్రంప్‌ను బహుమతికి నామినేట్ చేశారు.

ట్రంప్ గెలిస్తే  నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న ఐదవ అమెరికా అధ్యక్షుడు అయ్యేవాడు. గతంలో నోబెల్​ శాంతి బహుమతి గ్రహీతలలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, మాజీ అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ,మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ ఉన్నారు.