
- ఆమె రిలీజ్ కోసం ఇరాన్లో ఉద్యమం
దుబాయ్ : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మది జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ విషయం తెలియడంతో ఆమెను జైలు నుంచి రిలీజ్ చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఓ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఇరాన్ హక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మది మహిళలపై అణచివేతను ప్రశ్నిస్తున్నారు. హిజాబ్, మరణశిక్షలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ను జైలుకు పంపారు. గతేడాది హిజాబ్ధరలించలేదన్న కారణంతో 22 ఏండ్ల మహ్సా అమినిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోనే ఆమె హత్యకు గురికావడం సంచలనం రేపింది. దీనిపై జైలు నుంచే పోరాడిన మొహమ్మది.. తాజాగా నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనిపై జైలు అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, గుండె, ఊపిరితిత్తులకు సంబంధిం చిన సమస్యలతో బాధపడుతున్న మొహమ్మది ని స్పెషలిస్ట్ ఆసుపత్రికి తరలించాలని కొన్నిరోజులుగా ఆమె కుటుంబం డిమాండ్ చేస్తోంది.