Nobel Prize: హంగేరియన్ రచయితకు.. సాహిత్యంలో నోబెల్ బహుమతి

Nobel Prize: హంగేరియన్ రచయితకు.. సాహిత్యంలో నోబెల్ బహుమతి

2025 నోబెల్ సాహిత్య పురస్కారం హంగేరియన్ నవలా రచయితను వరించింది. హంగేరికి చెందిన నవలా రచయిత, స్క్రీన్ రైటర్ లాస్లో క్రాస్జ్నా హోర్కైకి రాయల్ స్వీడిష్ అకామి ఆఫ్ సైన్సెస్  ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 71ఏళ్ల లాస్లో క్రాస్జ్నా హోర్కై ప్రతిష్టాత్మక సాహిత్య నోబెల్ ను అందుకున్న రెండో హంగేరియన్. ఇంతకుముందు 2002లో ఇమ్రే కెర్టెజ్‌కు లభించింది. బహుమతి మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రోనాలు అంటే  ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 8.7 కోట్లు.

సాహిత్యంలో విశేష కృషి చేసినందు కు హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నా హోర్కైకు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి లభించింది. అపోకలిప్టిక్ భయాందోళనల మధ్య కళాశక్తిని చూపిన ఆయన సాహిత్య ప్రస్థానానికి గుర్తింపుగా నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. కమిటీ ఆయనను అపోకలిప్టిక్ భయంతో నిండిన ప్రపంచంలోనూ కళ యొక్క శక్తిని పునరుద్ఘాటించిన విజనరీ రచయితగా పేర్కొంది. 

లాస్లో క్రాస్నాహో ర్కై, 1954లో హంగేరీ తూర్పు ప్రాంతంలోని చిన్నపట్టణం గ్యులాలో జన్మించారు. ఆయన రచనల్లో సెంట్రల్ యూరోపియన్ సాహిత్య సంప్రదాయానికి చెందిన లోతైన ఆలోచన లు, అబ్సర్డిజం, గ్రోటెస్క్ అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కాఫ్కా నుంచి థామస్ బెర్న్ హా ర్డ్ వరకు ఉన్న ఆ సాహిత్య వారసత్వాన్ని కొ నసాగించారు.

 1985లో వెలువడిన ఆయన తొలి నవల 'సాటాంటాంగో, హంగేరీలో సంచలనం సృష్టించింది. ఈ రచనతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. జర్మనీ సామాజిక పరిస్థితులను నిజాయితీగా చిత్రించిన 'హెర్జ్ 07769' ఆధునిక జర్మన్ సాహిత్యంలో గొప్ప రచనగా ప్రశంసలు పొందింది.