అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్ రూల్స్ ఏంటీ.. నిబంధనలు ఏం చెబుతున్నాయి ?

అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్ రూల్స్ ఏంటీ.. నిబంధనలు ఏం చెబుతున్నాయి ?

నోయిడా, సెక్టార్‌ 137లోని పరాస్‌ టియెర్రా సొసైటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ వైర్‌ తెగి పోయిన ఘటనలో 72 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో పోలీసులు జర్మన్‌ ఎలివేటర్‌ తయారీదారైన జర్మన్‌ కంపెనీ థైస్సెన్‌క్రప్‌తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సొసైటీ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ మీద కూడా కేసు నమోదు చేశారు. 

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం కాదు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ, కమల్‌ మార్కెట్‌లో 29 ఏళ్ల వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి మృతి చెందాడు. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్‌లో నోయిడాలోని ఓ హోటల్‌లోని ఎలివేటర్ మూడో అంతస్తు నుంచి బేస్‌మెంట్‌కు కూలిపోవడంతో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. 

కమర్షియల్‌ ప్రాంతాలు, జనావాసాల్లో వినియోగించే లిఫ్ట్‌లు వేర్వురుగా ఉంటాయి. ఒక ఎలివేటర్‌ జీవిత కాలం 20 నుంచి 25 ఏళ్ల వరకూ ఉటుంది. అలాగే, లిఫ్ట్‌ వినియోగించే సమయంలో ఎన్నో నిబంధలు, జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే ప్రమాదాలను అరికట్టగలరు. 

లిఫ్ట్‌ వినియోగానికి సంబంధించిన రూల్స్‌

  • ఒక బిల్డింగ్‌ 13 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉంటే లిఫ్ట్‌ ఉండాలి.
  • ఇళ్లలో వినియోగించే లిఫ్ట్‌ అయితే.. దాని సామార్థ్యం 204 కేజీల(ముగ్గురు) కన్నా తక్కువ ఉండకూడదు. అలానే 272 కేజీల కన్నా ఎక్కువ ఉండకూడదు. 
  • లిఫ్ట్‌ వేగం సెకనుకు 0.2 మీటర్లకు మించకూడదు.
  • ఒక బిల్డింగ్‌ లేదా కాంప్లెక్స్‌ లేదా ప్రాజెక్ట్‌‌లో లిఫ్ట్‌ ఇన్‌స్టాల్‌ చేయాలనుకుంటే.. సదరు యజమాని ప్రభుత్వం నుంచి రెండు రకాల లైసెన్స్‌లు తీసుకోవాలి. ఒకటి ఇన్‌స్టాలేషన్‌ కోసం మరొకటి వినియోగం కోసం.
  • రెసిడెన్షియల్ ఎలివేటర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి కనీసం 20 నుంచి 25 చదరపు అడుగుల స్థలం ఉండాలి. దీంతో పాటు 8 చదరపు అడుగుల పిట్ ఏరియా కూడా ఉండాలి.
  • ఫైర్ అలారం మోగిన సమయంలో లిఫ్ట్‌ ఉపయోగించకూడదు.