
కరోనా వైరస్ తో అప్రమత్తమైన ఢిల్లీకి చెందిన రెండు స్కూళ్ల యాజమాన్యం అప్రమత్తమైంది. నోయిడాకు చెందిన శ్రీరామ్ మిలీనియం స్కూల్, శివ నాడార్ స్కూల్ కు రెండు వారాల పాటు స్కూల్ కు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఇటీవల ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి ఇటలీ వెళ్లాడు. ఇటలీ నుంచి వచ్చిన సదరు వ్యక్తి కరోనా వైరస్ పై అనుమానం రావడంతో మయూర్ విహార్ లో ఉన్న ఓ వైద్యుణ్ని సంప్రదించాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆ వైద్యుడు కరోనా సోకినట్లు కన్ఫాం చేయలేదు. అయితే బాధితుడు అత్యవసర చికిత్స కోసం రామ్ మనోహర్ లోహియాలో చేరాడు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు..బాధితుడు బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షలు నిర్వహించగా తాజాగా అతడికి కరోనా అటాక్ అయినట్లు గుర్తించారు.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ బాధితుడి కుమార్తె శ్రీరామ్ మిలీనియం స్కూల్లో చదువుతుంది. ఇటలీ నుంచి వచ్చిన బాధితుడు కుమార్తె బర్త్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించాడు. ఆ వేడుకలకు మిలీనియం స్కూల్ పిల్లలు అటెండ్ అయ్యారు.
తాజాగా బాధితుడికి కరోనా వైరస్ కన్ఫాం అవ్వడంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ..బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న స్కూల్ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది.
స్కూల్ కు సెలవులు ప్రకటించిన యాజమాన్యం
కరోనా వైరస్ ప్రస్తావించని శ్రీరామ మిలీనియంకు చెందిన రెండు విద్యా సంస్థలకు యాజమాన్యం సెలవులు ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీరామ్ మిలీనియం ప్రిన్సిపల్ ఉత్తరా సింగ్ పిల్లల తల్లిదండ్రులకు సర్క్యూలర్ జారీ చేశారు. వారం రోజుల పాటు స్కూల్ కు సెలవులు ప్రకటిస్తున్నాం. ఫ్లూతో బాధపడే పిల్లల్ని స్కూల్ పంపొద్దు. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా మేము ఈ రోజు షెడ్యూల్ చేసిన పరీక్షలను వాయిదా వేస్తున్నాం. ఎగ్జామ్స్ రీషెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తాం. బోర్డ్ పరీక్షలు మామూలుగానే కొనసాగుతాయి. 7నుంచి 11 తరగతుల పిల్లలు కావాలనుకుంటే అదనపు తరగతులకు రావచ్చు. 6వ తరగతి మరియు ఐజిసిఎస్‌ఇ తరగతుల విద్యార్ధులకు హాలిడేస్ ప్రకటిస్తున్నాం అంటూ మెయిల్ చేశారు.