యూట్యూబ్ ఛానెల్ లైక్, సబ్ స్క్రైబ్ చేసింది.. రూ.13 లక్షలు కొట్టేశారు

యూట్యూబ్ ఛానెల్ లైక్, సబ్ స్క్రైబ్ చేసింది.. రూ.13 లక్షలు కొట్టేశారు

ఆన్‌లైన్ వేదిక‌గా రోజుకో త‌ర‌హా మోసంతో సైబ‌ర్ నేర‌గాళ్లు  అమాయ‌కుల‌ను అడ్డంగా దోచేస్తున్నారు. ఇంటి నుంచి ప‌నిచేస్తూ ఆన్‌లైన్‌లో అద‌నంగా ఆర్జించ‌వ‌చ్చని మ‌భ్యపెడుతూ క్షణాల్లో బాధితుల ఖాతా నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు. నోయిడాకు  చెందిన మ‌హిళ‌ను స్కామ‌ర్లు యూట్యూబ్ చానెల్స్‌ను స‌బ్‌స్క్రైబ్ చేస్తూ ఆదాయం స‌మ‌కూర్చుకోవ‌చ్చని న‌మ్మించి ఏకంగా రూ.13 ల‌క్షలుపైగా దోచుకున్నారు

నోయిడాకు  మహిళయూట్యూబ్ జాబ్ స్కామ్‌లో రూ. 13 లక్షలకు పైగా నష్టపోయింది. . యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి  సబ్‌స్క్రైబ్ చేయడానికి "వర్క్-ఫ్రమ్-హోమ్ జాబ్  ఆఫర్ తో మోస పోయింది. గ్రేటర్ నోయిడాలోని పంచశీల్ హైనిష్ సొసైటీ నివాసి కార్తీకతో నేరగాళ్లు  WhatsApp మరియు టెలిగ్రామ్ లో కనెక్టివిటీ అయ్యారు.  ఆమె చేసిన వర్క్ ఫ్రం హోం పనికి   మొదట ఆమె ఖాతాలో 150 రూపాయిలు జమ చేశారు.  ఆ తరువాత ఆమెకు మాయ మాటలు చెప్పి  నాస్‌డాక్‌లో  2 వేల రూపాయిలుపెట్టుబడి పెట్టించారు.  లాభంగా అదే రోజున తనకు 3 వేల 150  రూపాయిలు ఇచ్చారని తెలిపింది.    ఆతరువాత కార్తీక 5 వేలు,30 వేలు,90  వేల రూపాయిలను దశల వారీగా పంపింది. ఆ తరువాత కూడా 3 లక్షలు ఒకసారి... 4 లక్షలు ఒకసారి పంపింది.   ఇంకా అత్యాసతో పెట్టుబడి పెట్టేందుకు భర్త పేరు మీద పర్శనల్ లోన్ తీసుకొని . ..చివరి లావాదేవీగా రూ.2.50 లక్షలు చెల్లించింది.  ఎన్ని రోజులకు డబ్బులు తిరిగి రాకపోవడంతో తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిపాజిట్ చేసింది. 

అయితే నేరగాళ్లు  ఆమెకు చెల్లించేందుకు  రూ. 15 లక్షల రూపాయిలను  క్లియరెన్స్ కోసం   పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేశారు.  త్రెషోల్డ్ (క్లియరెన్స్) పూర్తి చేసేందుకు మోసగాళ్లు  3 లక్షల 37వేల600  రూపాయిలు డిమాండ్ చేయడంతో కార్తీక  దంపతులు మరో పర్సనల్ లోన్ తీసుకున్నారు. మొత్తం చెల్లించిన తర్వాత మోసగాళ్లు  మళ్లీ  5 లక్షల 20 వేలు  అడిగారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   నాస్‌డాక్ నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి కూడా ప్రయత్నించారు. కాని డబ్బులు రాలేదు.  బాధితుల ఫిర్యాదు మేరకు  పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణలు) చట్టం, 2008 సెక్షన్ 66డి, చీటింగ్ కేసు నమోదు చేశారు. సైబర్ మోసంపై సెక్టార్ 58 నోయిడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.