షాద్​నగర్​లో నిరుద్యోగి నామినేషన్

షాద్​నగర్​లో నిరుద్యోగి నామినేషన్
  • విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున పోటీ

షాద్ నగర్, వెలుగు : ‘విద్యార్థుల రాజకీయ పార్టీ’ తరఫున షాద్​నగర్ నియోజకవర్గం నుంచి సాయి కుమార్ సారా అనే నిరుద్యోగి నామినేషన్ దాఖలు చేశాడు. బుధవారం షాద్ నగర్ పట్టణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు.

తాను నామినేషన్ వేయడానికి 2 వేల నిరుద్యోగుల ఇండ్ల నుంచి ఐదు రూపాయల చొప్పున విరాళంగా తీసుకున్నట్లు తెలిపాడు. రాష్ట్ర వ్యాప్తంగా 36లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, షాద్​నగర్ నియోజకవర్గంలో 60వేల మంది ఉన్నారని వివరించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులంతా ప్రభంజనం సృష్టిస్తారని తెలిపాడు.