అభ్యర్థులు ఆన్లైన్లో కూడా నామినేషన్ వేయొచ్చు : వికాస్ రాజ్

అభ్యర్థులు ఆన్లైన్లో కూడా నామినేషన్ వేయొచ్చు :   వికాస్ రాజ్

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఆన్లైన్లో కూడా అందించొచ్చని చెప్పారు సీఈసీ వికాస్ రాజ్. నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా లెటెస్ట్ ఫోటోలు పెట్టాలని తెలిపారు. లేదంటే నామినేషన్ పత్రాలను రిజక్ట్ చేస్తామన్నారు వికాస్ రాజ్.  హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ ఫామ్, అఫిడవిట్ లు జాగ్రత్తగా నింపాలని తెలిపారు.  ఫా-ఏ, ఫాం-బీపై ఒరిజినల్ సంతకాలు ఉండాలని చెప్పారు.

 నామినేషన్ పేపర్లు దాఖలు సమయంలో ఒకసారి ఆర్వో ఆఫీస్ కు ఎంటరైతే బయటకు వెళ్ళడానికి వీలు లేదన్నారు వికాస్ రాజ్.  నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని ఆర్వోలను ఆదేశించామని  తెలిపారు. అభ్యర్థి ఖచ్చితంగా క్రిమినల్ హిస్టరీ పబ్లిష్ చెయ్యాలని చెప్పారు.  నామినేషన్  వేసే ప్రతి అభ్యర్థి  ముందు రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్నికల ఖర్చు అకౌంట్ లో చూపించాలని..  గత సారి ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఉపయోగించవద్దని తెలిపారు.  

also read : హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం

ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. ఏప్రిల్ 26 న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల  విత్ డ్రాకు అవకాశం ఇచ్చింది ఈసీ. మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. 19, 23,24వ తేదీల్లో మంచి ముహూర్తం ఉండటంతో ఆ రోజుల్లో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. 21వ తేదీన మంచి రోజు ఉన్నా.. ఆదివారం కావడంతో నామినేషన్లకు ఛాన్స్ లేకుండా పోయింది. ఓవరాల్ గా ఈనెల 19వ తేదీన ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు తీసుకున్నారు అధికారులు. ఒక్కో అభ్యర్ధి 2 సెట్లు, 3 సెట్లు వేశారు.