రెండేండ్లుగా ఫీజ్ రీయింబర్స్ చేయడంలేదు

రెండేండ్లుగా ఫీజ్ రీయింబర్స్ చేయడంలేదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను రీయింబర్స్ చేయకపోవడం స్టూడెంట్లకు శాపంగా మారింది. పూర్తి ఫీజులను కట్టిన తర్వాతే సర్టిఫికెట్లు తీసుకోవాలని కాలేజీలు కండిషన్లు పెడుతున్నాయి. ప్రైవేటులోనే కాదు.. ప్రభుత్వ కాలేజీలు కూడా ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పీజీతో పాటు ఇతర అన్ని టెక్నికల్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్టూడెంట్లు, వారి పేరెంట్స్​ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే సారి మొత్తం ఫీజు కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆవేదన చెందుతున్నారు.

రెండేండ్ల బకాయిలు పెండింగ్

డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువులు పూర్తయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర విద్యార్థులకు ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్​మెంట్ ఇవ్వలేదు. రెండేండ్లకు సంబంధించిన బకాయిలు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. దీంతో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల కాలేజీలు ఉండగా.. వాటిలో ఏటా 5 లక్షల మంది చేరుతున్నారు. అర్హులైన స్టూడెంట్లకు ప్రభుత్వం స్కాలర్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫీజు రీయింబర్స్​మెంట్ అందిస్తున్నది. 2021–22లో రెన్యూవల్​ విద్యార్థులతో కలిపి సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇప్పటి దాకా ఒక్క పైసా రాలేదు. అంతకుముందు బకాయిలనూ ప్రభుత్వం ఇవ్వలేదు. ఫీజు మొత్తం కట్టి సర్టిఫికెట్లు తీసుకుపోవాలని కాలేజీలు సూచిస్తున్నాయి. మొన్నటిదాకా ఈ వేధింపులు ప్రైవేటు కాలేజీల్లోనే ఉండేవి. ఈసారి సర్కారు కాలేజీల్లోనూ మొదలయ్యాయి. రీయింబర్స్‌‌ మెంట్ వచ్చినప్పుడు స్టూడెంట్లకు తిరిగి ఇచ్చేస్తామని ప్రభుత్వ కాలేజీల్లో చెప్తున్నారు.

జీవోలు జారీ.. నిధులు నిల్

రాష్ట్రంలో రూ.2,800 కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. రెండేండ్లుగా ప్రభుత్వం బకాయిలు సక్రమంగా విడుదల చేయడం లేదని మేనేజ్​మెంట్లు అంటున్నాయి. సర్కారు అధికారికంగా నిధులు రిలీజ్ చేస్తున్నట్టు జీవోలు ఇస్తున్నా.. స్టూడెంట్లు, మేనేజ్​మెంట్ల ఖాతాల్లో నిధులు జమ కావడం లేదని కాలేజీల ప్రిన్సిపాల్స్ పేర్కొంటున్నారు. 

స్టూడెంట్ల ఆందోళనలు

ఫీజు బకాయిల కోసం మేనేజ్​మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుపోతున్నారు. మరి కొందరు ఆందోళనలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని గిరిరాజ్ కాలేజీలో వందల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపారు. ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుపోవాలని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పేశారు. ఏఐపీఎస్​యూ ఆధ్వర్యంలో స్టూడెంట్లు జిల్లా కలెక్టర్​ , స్థానిక ఎమ్మెల్సీ కవిత ఆఫీసులోనూ ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలోనూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. రాష్ట్రంలోని అన్నికాలేజీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.

“నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గిరిరాజ్ సర్కార్ డిగ్రీ కాలేజీలో ఈ ఏడాది బీబీఏ పూర్తి చేశా. పీజీ కౌన్సెలింగ్ కోసం సర్టిఫికెట్లు కావాలని కాలేజీకి పోతే రూ.25,250 కట్టమన్నరు. ఫ్రీ సీటు కదా అంటే..‘ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలే. అందుకే మీ నుంచి తీసుకుంటున్నం’ అని అంటున్నరు. ఇప్పుడు 25 వేలు ఏడికెల్లి తేవాలి?’’     - ఓ విద్యార్థి
“హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేటు​కాలేజీలో సీఎస్ పూర్తి చేసిన. సర్టిఫికెట్ల కోసం పోతే.. ఫీజు రీయింబర్స్​మెంట్ రాలేదని, ఫీజు మొత్తం కట్టి సర్టిఫికెట్లు తీసుకుపోవాలని అంటున్నరు. ఇప్పుడు రూ.30 వేలు కట్టమంటే ఎట్ల?”- ఓ విద్యార్థి

ఫీజులు ఇవ్వకుంటే కాలేజీలు ఎట్ల నడపాలె?

రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్ చేయకపోతే కాలేజీలు ఎట్లా నడపాలి? లెక్చరర్లు జీతం తీసుకోకుండా పనిచేస్తరా? ఎగ్జామ్ ఫీజు తీసుకోకుండా బోర్డులు పరీక్షలు రాయనిస్తున్నాయా? అఫిలియేషన్ ఫీజు తీసుకోకుండా మాకు గుర్తింపు ఇస్తున్నారా? వెంటనే బకాయిలు విడుదల చేయాలి.
- గౌరీ సతీశ్, కేజీ టు పీజీ ప్రైవేటు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల సంఘం కన్వీనర్