పోడుపట్టాలియ్యలే పట్టించుకోలే .. ఎన్నికలు బహిష్కరిస్తాం

పోడుపట్టాలియ్యలే పట్టించుకోలే  .. ఎన్నికలు బహిష్కరిస్తాం

జైనూర్, వెలుగు : తమను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, అందుకే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని కుమ్రం భీమ్ ​ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఏజెన్సీ గిరిజనేతరులు ప్రకటించారు. ఆదివారం జిల్లాలోని లింగాపూర్ మండలంలోని మామడపల్లి పరిధిలోని వంజారిగూడాలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏజెన్సీ గిరిజనేతరుల సంఘం ప్రెసిడెంట్ కేంద్రెనాథ్ రావు మాట్లాడుతూ తాము తాత ముత్తాతల కాలం నుంచి సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వలేదని వాపోయారు.

గృహలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా పథకాలకు దూరంగా ఉన్నామని..గిరిజనేతరులు ఉంటున్న గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు భూములకు కనీసం పహాణి కూడా లేదన్నారు. తమను ఆదుకోని ప్రజాప్రతినిధులకు ఓట్లు వేయమని, అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోకల్ బాడీ ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. సంఘం వైస్ ప్రెసిడెంట్​చావలే ఉమాకాంత్, సభ్యులు పాల్గొన్నారు.