
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్ కాంబోలో వస్తోన్న మూవీ మట్కా. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ మూవీలో కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi) నటించనుందనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ బాహుబలి మనోహరి సాంగ్ తో కాలు కదిపినా ఈ భామ..మట్కా మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనుందట.దీంతో పాటు ఒక స్పెషల్ సాంగ్ కు డాన్స్ చేస్తోందని సమాచారం.
ఇప్పటి వరకు పెప్పీ ఐటమ్ సాంగ్స్ లోనే చూసిన ఆడియాన్స్ కు.. ఈ మూవీతో తనలోని విభిన్న యాక్టింగ్ కూడా చూస్తారని డైరెక్టర్ కరుణకుమార్ తెలిపారు.మట్కా మూవీ వాస్తవ సంఘటనలతో కూడిన.. క్రైమ్ డ్రామా కథ.కాగా ఈ స్టోరీ 1968 లో స్టార్ట్ అయ్యి 1982 లో ముగుస్తుంది.అలాగే ఈ మూవీలో మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.
నోరా ఫతేహి క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో కూడా నటిస్తోంది. ఔరంగా జేబు చెల్లెలు..మహారాణి పాత్ర పోషిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ డిఫరెంట్ మూవీస్ లో నటిస్తున్న నోరా ఫతేహి..యాక్టింగ్ నిరుపించుకుంటే తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.
వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ మూవీను నిర్మించనున్నారు.