Nora Fatehi: డబ్బు,ఫేమ్ కోసమే ఆ పని..ఇలాంటివి కళ్లారా చూశాను

Nora Fatehi: డబ్బు,ఫేమ్ కోసమే ఆ పని..ఇలాంటివి కళ్లారా చూశాను

కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi)ని మేకర్స్ తీసుకున్నట్లు సమాచారం.ప్రభాస్ బాహుబలి మనోహరి సాంగ్ తో కాలు కదిపినా ఈ భామ..ఇప్పటి వరకు పెప్పీ ఐటమ్ సాంగ్స్ లోనే చూసిన ఆడియాన్స్ కు..ఈ సారి తన డ్యాన్స్ తో కాకుండా తన మాటలతో కంగుతినేలా చేసింది.  

రీసెంట్గా నోరా పోడ్‌కాస్ట్‌లో పాల్గొని సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంచలన విషయాలను చెప్పుకొచ్చింది. సినిమా పరిశ్రమకి చెందిన  కొంతమంది వ్యక్తులు ప్రేమలో ఉండి మ్యారేజ్ మాత్రం చేసుకోరని..కేవలం ఫేమ్ ద్వారా వచ్చే 'డబ్బు' కోసమే పెళ్లి చేసుకుంటారని నోరా తెలిపింది.అంతేకాదు ఇలాంటి ఆలోచన ఉన్నోళ్లు ఓ వర్గం..సర్కిల్‌లలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే పెళ్లిళ్లు చేసుకుంటారంటూ ఎవ్వరికీ తెలియని విషయాలని బయటికి తీసింది.చాలా సార్లు తన ముందే ఇలాంటివి జరగడం కళ్లారా చూశానని నోరా తెలిపింది.

కొందరు తమకి సంబంధించిన భాగస్వాముల ద్వారా వారి నెట్‌వర్క్, కాంటాక్ట్స్ కోసం కూడా అన్ని విధాలుగా ఉపయోగించుకుంటారని కెనడా బ్యూటీ నోరా ఈ విషయాలను బయట పెట్టింది. కానీ, ఇవన్నీ చెప్పుకొచ్చిన నోరా..మరి ఇలాంటి విషయాలు చేసేదెవరో..ఇంతకు మునుపు చేసిందెవరో మాతరం పేరు వెల్లడించలేదు. 

ప్రేమించని వ్యక్తిని పెళ్లి చేసుకుని ఏళ్ల తరబడి జీవించడం కంటే దారుణం ఏమీ ఉండదు. మన ఇండస్ట్రీలో చాలా మంది ఆ పనికిమాలిన పని చాలా మందికి పైగా చేస్తున్నారని తెలిపింది. వ్యక్తిగత జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని త్యాగం చేయడం నాకు ఇప్పటికీ అసలు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. 

ఇక నోరా ఫతేహి సినిమాలు చూసుకుంటే..క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో కూడా నటిస్తోంది. ఔరంగా జేబు చెల్లెలు..మహారాణి పాత్ర పోషిస్తుంది. అలాగే వరుణ్ తేజ్ మట్కా మూవీలో కూడా నటిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)