
Vastu: ఉత్తరం రోడ్ ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటే మెయిన్ డోర్ తూర్పు దిక్కులో ఉండేలా ఇంటిని నిర్మించుకోవచ్చా.. ఇంటికి బాత్రూమ్ కు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి.. ఈ విషయాలపై వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచనలను ఒకసారి పరిశీలిద్దాం. ..
ప్రశ్న: మా ప్లాట్ కు ఉత్తరం దిక్కు రోడ్ ఉంది. అయితే, తూర్పు వైపు ప్రధాన ద్వారం ఉండేలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఇలా కట్టుకోవచ్చా? లేక రోడ్ ఉన్నవైపే మెయిన్ డోర్ ఉండేలా ఇల్లు కట్టుకోవాలా?
జవాబు: వీలునుబట్టి ప్రధాన ద్వారం ఎటువైపైనా కట్టుకోవచ్చు. ఉత్తరం దిక్కు రోడ్ ఉన్నప్పటికీ, తూర్పు వైపు ప్రధాన ద్వారం ఉండేలా ఇల్లు కట్టుకోవచ్చు. లేదా ఉత్తరం దిక్కు అయినా మెయిన్ డోర్ ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రశ్న: కొత్తగా కట్టుకోబోతున్న ఇంటికి బయట బాత్రూమ్స్ కట్టుకోవాలనుకుంటున్నాం. ఇంటికి ఉత్తరంవైపు ఎక్కువ స్థలం వదలాలి అన్నారు. అక్కడ బాత్రూమ్ కట్టుకోవచ్చా? ఇంటికి, బాత్రూమ్కు ఎంత గ్యాప్ ఇవ్వాలి?
జవాబు: ఉత్తర వాయువ్యం దిక్కు, కాంపౌండ్ లోపల బాత్రూమ్ కట్టుకోవచ్చు. అయితే కాంపౌండ్ వాల్ , ఇంటికి తగలకుండా మధ్యలో బాత్రూమ్ కట్టుకోవాలి. రెండింటికీ మధ్య కనీస దూరం ఉండేలా చూసుకోవాలి