IPL 2026: ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు.. ఇంజూర్డ్ ప్రీమియర్ లీగ్

IPL 2026: ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు.. ఇంజూర్డ్ ప్రీమియర్ లీగ్

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ క్యాచ్ రిచ్ లీగ్ మొదలుకాక ముందే గాయాల బారిన పడుతున్న ఆటగాళ్లతో టోర్నీపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి మాత్రం “ఇంజూర్డ్ ప్రీమియర్ లీగ్”గా మారుతుంది అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఆయా జట్లకు చెందిన స్టార్ ప్లేయర్లు గాయాలతో టోర్నీకి దూరమవుతుండటం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ముఖ్యంగా బౌలర్లు, ఆల్‌రౌండర్లు వరుసగా ఇంజరీలకు గురవ్వడం జట్ల సమతౌల్యంపై ప్రభావం చూపుతోంది.

ఆటగాళ్లు గాయంతో టోర్నీకి దూరం కావడంపై సోషల్ మీడియాలో  “IPL కాదు.. ఇంజూర్డ్ ప్రీమియర్ లీగ్ అంటూ నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా ఈ టోర్నమెంట్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుండటంతో.. మరికొంత మంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా జట్లు కూడా ప్రత్యామ్నాయ ప్లేయర్స్ కోసం వెతుకుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఈసారి ఐపీఎల్ గాయాలతోనే  వార్తల్లో నిలుస్తుంది. అభిమానులు మాత్రం తమకు ఇష్టమైన ఆటగాళ్లు త్వరగా కోలుకుని స్టేడియంలోకి రావాలని కోరుకుంటున్నారు. 

ఐపీఎల్ కి దూరమైన ఆటగాళ్లు వీళ్లే: 
*  నాథన్ ఎల్లిస్ (CSK)
* సామ్ కరన్ (RR) 
* హర్షిత్ రాణా (KKR)
* ఆడమ్ మిల్నే (RR) 
* జాక్ ఎడ్వర్డ్స్(SRH) 
* వానిందు హసరంగా (LSG) ఇప్పటికే లీగ్ నుంచి వైదొలిగారు. 

ప్రారంభ మ్యాచులకు దూరమైన ప్లేయర్స్: 
* హేజిల్ వుడ్ (RCB)
* పాట్ కమిన్స్ (SRH) గాయాలతో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఈనెల 28వ తేదీన లీగ్ ప్రారంభమయ్యే లోపు ఇంకెంత మంది ఇలా గాయాల బారిన పడతారో అని క్రికెట్ అభిమానులు మదనపడుతున్నారు?.