డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరమని చెప్పలేం 

డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరమని చెప్పలేం 

న్యూఢిల్లీ: డెల్టా ప్లస్ వేరియంట్ చాలా ప్రమాదమని వస్తున్న వార్తలపై ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. ఈ వేరియంట్ ప్రమాదకరమని చెప్పడానికి తమ దగ్గర తగిన డేటా లేదన్నారు. ‘డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఇమ్యూనిటీ వ్యవస్థ నుంచి ఇది తప్పించుకుంటుందని చెప్పడానికి మా దగ్గర సరైన డేటా లేదు. దీనిపై ఇప్పుడు మేం ఏమీ చెప్పలేం. కానీ ఈ వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలన్నదే మా సూచన. ఎలాంటి కొవిడ్ వేరియంట్‌తోనైనా అప్రమత్తంగా ఉండాల్సిందే’ అని గులేరియా చెప్పారు. ఇక వేర్వేరు టీకాలను కలిపి తీసుకోవడంపై ఆయన స్పందిస్తూ.. మిక్సింగ్ డోసులు ప్రభావవంతంగా ఉంటాయని పరిశోధనల్లో తేలిందన్నారు. అయితే దీని వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే చాన్సులు కూడా ఉన్నాయని చెప్పారు. మిక్సింగ్ డోసులను అందుబాటులోకి తీసుకొచ్చే ముందు దీనిపై మరింత డేటాను సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు.