
- ముంబై పోలీసుల హెచ్చరిక
ముంబై: బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెడ్‌బాడీ ఫొటోలు ఆన్లైన్ లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు కోరారు. సుశాంత్ సింగ్ డెడ్‌బాడీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలువురు తీవ్రంగా కలత చెందుతున్నట్లుగా గుర్తించామన్నారు. ఇలాంటి పోస్టులు తీవ్ర పరిణామాలకు దారతీయవచ్చని, ఇటువంటి ఫొటోలు పోస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే పోస్ట్ చేసిన ఫొటోలను తొలగించాలని అధికారులు సూచించారు.
పోస్ట్ మార్టం రిపోర్టుపై ఉత్కంఠ
‘ధోనీ’ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే, ఆయన మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అసలు కారణం తెలియనుంది.