అనుభవించిన దాని కన్నా దారుణమైన స్థితి మరొకటి ఉండదు

 అనుభవించిన దాని కన్నా దారుణమైన స్థితి మరొకటి ఉండదు

గతేడాది డ్రగ్స్ క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై తొలిసారి గౌరీ ఖాన్ స్పందించారు.  అనుభవించిన దాని కంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదని, కష్ట సమయంలో తామంతా ఒక కుటుంబంలా నిలబడ్డామన్నారు. తమకు ఆ సమయంలో ఎంతో ప్రేమ లభించిందన్న గౌరీఖాన్.. తమకు తెలియని వాళ్ల నుంచి కూడా మెసేజ్ లు వచ్చాయని తెలిపారు. ఇదంతా చూస్తుంటే మనందరం గొప్ప ప్రదేశంలో ఉన్నామని చెప్పారు. తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా గౌరీ చెప్పారు. ఇదంతా కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ లో భావనా పాండే, మహీప్ కపూర్ లతో కలిసి పాల్గొన్న ఆమె.. కరణ్ తో ఈ విధంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకున్నారు. 

డ్రగ్స్ క్రూయిజ్ డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అనేక వాదోపవాదాల తర్వాత ఆర్యన్ ఖాన్ కు జైలు శిక్ష పడింది. అయితే 26 రోజుల కస్టడీ అనంతరం బాంబే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇంత జరిగినా షారుఖ్ కుటుంబంలో ఎవరూ స్పందించలేదు. కానీ తొలిసారిగా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తన మనసులోని భావాలను ఇలా వెల్లడించారు.