డీఆర్‌‌‌‌డీఓలో 185 ఉద్యోగాలు

డీఆర్‌‌‌‌డీఓలో 185 ఉద్యోగాలు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌‌‌‌డీవో) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టుకు సంబంధించిన సబ్జెక్టుల్లో బీటెక్‌‌‌‌ లేదా ఇంజనీరింగ్‌‌‌‌ డిగ్రీ చేసిన వారు అర్హులు. గేట్ స్కోర్ తప్పనిసరి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేయాలి.

డీఆర్‌‌డీవో  భర్తీ చేసే 185 పోస్టులు మూడు పార్టులుగా ఉన్నాయి. పార్ట్‌–1లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో 116 పోస్టులున్నాయి.  వీటికి డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది.  పార్ట్‌–2లో ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ ఇంజినీరింగ్ లో 59 పోస్టులు ఉన్నాయి.   పార్ట్–3లో సైకాలజీ పోస్టులు 10 ఉన్నాయి. వీటికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ఎలిజిబులిటి:   సంబంధించిన సబ్జెక్టుల్లో బీటెక్‌‌‌‌ లేదా ఎమ్మెస్సీ. సైకాలజీ పోస్టుకు నెట్‌‌‌‌లో అర్హత సాధించాలి. గేట్‌‌‌‌ స్కోర్‌‌‌‌ తప్పనిసరి. చివరి ఏడాది చదువుతున్న వాళ్లు  కూడా అప్లై చేయవచ్చు. గత మూడు సంవత్సరాల గేట్‌‌‌‌ స్కోర్‌‌‌‌‌‌‌‌కు (2018, 2019, 2020) వ్యాలిడిటీ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌, మెకానికల్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌, కంప్యూటర్‌‌‌‌ సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ విభాగాల పోస్టులకు ఐఐటీ,ఎన్‌‌‌‌ఐటీలో ఇంజనీరింగ్‌‌‌‌, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌సైన్స్‌‌‌‌, ఎలక్ట్రానిక్స్‌‌‌‌అండ్ కమ్యూనికేషన్ కోర్సుల్లో 80శాతం మార్కులు సాధించినవారికి గేట్ స్కోర్ అవసరం లేదు.

సెలెక్షన్ ప్రాసెస్‌‌‌‌: డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, షార్ట్ లిస్టింగ్‌‌‌‌, పర్సనల్ ఇంటర్వ్యూ( ఎలక్ట్రానిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌, మెకానికల్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌, కంప్యూటర్‌‌‌‌ సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ విభాగాల పోస్టులకు  మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్‌‌‌‌ పరీక్షకు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. మిగిలిన పోస్టులకు గేట్‌‌‌‌/నెట్‌‌‌‌ స్కోర్‌‌‌‌కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ లెక్కిస్తారు)

శాలరీ:  జాబ్‌‌‌‌కు సెలెక్టయిన వారికి  రూ.56,100 బేసిక్ సాలరీ వస్తుంది. డీఏ, హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏలు అదనం. మెట్రో పాలిటన్‌‌‌‌ సిటీల్లో డ్యూటీ చేసిన వారికి ప్రారంభ వేతనం రూ.80 వేలు వస్తుంది. అనంతరం ప్రతిభ ఆధారంగా ప్రమోషన్లు లభిస్తాయి.

నోటిఫికేషన్

పోస్టుల సంఖ్య:185

అప్లికేషన్ లాస్ట్ డేట్‌‌‌‌: జులై 10

ఫీజు:రూ.100(ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు లేదు)

వయసు:28 సం.లు(ఓబీసీ ఎన్‌‌‌‌సీ వారికి 31, ఎస్సీ, ఎస్టీలకు 33 ఏళ్లు)

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేయాలి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ :www.rac.gov.in