పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. వేరే కోర్సుల్లో చేరిన స్టూడెంట్స్

పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. వేరే కోర్సుల్లో చేరిన స్టూడెంట్స్
  • నోటిఫికేషన్​కు ముందే స్టూడెంట్లను చేర్చుకుంటున్న కొన్ని కాలేజీలు
  • మేనేజ్ మెంట్లతో కుమ్మక్కయినట్లు బోర్డుపై విమర్శలు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ పూర్తయిన 8 నెలల తర్వాత పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లాసులు జనవరి నుంచి ప్రారంభమవుతాయని రెండ్రోజుల కింద ఇచ్చిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా ఇతర కోర్సుల్లో చేరిన తర్వాత, ఇప్పుడు అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వడంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారామెడికల్ కోర్సుల్లో చేరడానికి ఇంటర్ అర్హతగా ఉంది. ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇదే పద్ధతిని పాటించి..  జూన్/జులైలో అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చేవారు. కరోనా ఉన్నప్పుడు నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్ అన్నీ ఆలస్యంగా జరిగాయి. కానీ ఈ ఏడాది అలాంటి ఇబ్బందులేమీ లేకున్నా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేశారు. అకాడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాక, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే ఇంటర్ పూర్తయిన స్టూడెంట్లు వివిధ కోర్సుల్లో చేరిపోయారు. పారామెడికల్ కోర్సులపై ఆసక్తి ఉన్న స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెల్వక, ఇతర కోర్సుల వైపు మళ్లారు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నోటిఫికేషన్ ఇస్తే అడ్మిషన్ ఎవరు తీసుకుంటారని కొన్ని కాలేజీల యాజమన్యాలు ప్రశ్నిస్తుండగా, ఇంకొన్ని కాలేజీలు మాత్రం మౌనంగా ఉంటున్నాయి. 

ఆలస్యం వెనుక అవినీతి?

ఈ నోటిఫికేషన్ ఆలస్యం వెనుక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో 200లకు పైగా ప్రైవేటు పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 20 వేలకుపైగా సీట్లు ఉండగా, అందులో సగం సీట్లలో కూడా స్టూడెంట్లు జాయిన్ కావడం లేదు. దీనివల్ల కాలేజీల యాజమాన్యాలు నష్టపోతున్నాయి. ఈ నష్టం నుంచి గట్టెక్కేందుకు కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఒక గ్రూపుగా మారి, నోటిఫికేషన్ ఆలస్యమయ్యేలా లాబీయింగ్ చేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గ్రూపులో ఉన్న కాలేజీల మేనేజ్ మెంట్లు నోటిఫికేషన్ రాకముందే స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ కాలేజీల్లో చేర్చుకుంటున్నాయి. రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ తప్ప ఇంకే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మభ్యపెట్టి, వారి నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. ఇలా తమ కాలేజీల్లో పిల్లలను చేర్చుకున్న తర్వాత, నోటిఫికేషన్ రిలీజ్ చేయిస్తున్నాయి. అప్పుడు ప్రభుత్వ కాలేజీల్లోకి, ఇతర ప్రైవేటు కాలేజీల్లోకి వెళ్లేందుకు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం లేకుండా చేస్తున్నాయి. నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకముందే స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, బోర్డు అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న అవినీతి వ్యవహారమేనని ఓ కాలేజీ ఓనర్ చెప్పారు. 

అడ్మిషన్లు, ఎగ్జామ్స్ విధానం మారాలి..

పారామెడికల్ విద్యా వ్యవస్థ నాసిరకంగా ఉండడం వల్ల స్కిల్ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు రావడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి టెక్నీషియన్లను తమ సంస్థల్లో పని చేయించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజయా డయాగ్నస్టిక్స్ వంటి సంస్థలు ఇదివరకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. జనవరి నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగులోనూ ఇలా అరకొర చదువులతో పారామెడికల్ కోర్సులు చేసినవాళ్లే జనాలకు కంటి పరీక్షలు చేయబోతున్నారు. డయాగ్నస్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవహారంలో ల్యాబ్ టెక్నీషియన్లు కీలక పాత్ర పోషిస్తారు. వాళ్లు అవగాహన లోపంతో తప్పులు చేస్తే, ఆ ఎఫెక్ట్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పడుతుంది. దానివల్ల అంతిమంగా నష్టపోయేది రోగులేనని డాక్టర్లు చెబుతున్నారు. మన దగ్గర వ్యవస్థ బాగుపడాలంటే అడ్మిషన్లు, ఎగ్జామ్స్ నిర్వహణ విధానాన్ని మార్చాలని సూచిస్తున్నారు. రెండేండ్లకు కలిపి ఒకేసారి ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టకుండా.. ఏడాదికి రెండు సెమిస్టర్లు, అడ్మిషన్లకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టాలని సూచిస్తున్నారు.

అవసరానికి మించి కాలేజీలు

మన రాష్ట్రంలో అవసరానికి మించి పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సుమారు రెండొందలకు పైగా కాలేజీల్లో 70 శాతం సీట్లు ఖాళీగా ఉంటుండగా, ఇంకా కొత్త కాలేజీలకు పర్మిషన్ ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పొందేందుకే ఇలాంటి కాలేజీలు నెలకొల్పుతుండగా, అధికారులు వీరికి సహకరిస్తున్నారు. 2019లో గుర్తింపు లేని కాలేజీలకు కూడా రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిధులు విడుదల చేశారు. ఈ కాలేజీలు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేర్చుకోవడమే తప్పితే వారికి క్లాసులు చెప్పడం లేదు. ఎగ్జామ్స్ నిర్వహణ కూడా బీహార్ మాదిరి తూతూమంత్రంగా సాగుతోంది. రెండేండ్ల కోర్సుకు ఒకేసారి ఎగ్జామ్స్ నిర్వహిస్తుండడం కాలేజీల యాజమాన్యాలకు కలిసి వస్తోంది.