ఏపీలో ఆగ‌స్ట్ 6న ఎమ్మెల్సీ ఎన్నిక‌కు నోటిపికేష‌న్

ఏపీలో ఆగ‌స్ట్ 6న ఎమ్మెల్సీ ఎన్నిక‌కు నోటిపికేష‌న్

ఆంధ్రప్రదేశ్ శాస‌న మండ‌లిలో ఖాళీ అయిన ఒక స్థానానికి ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇవాల ( గురువారం) విడుద‌ల చేసింది. ప్ర‌స్తుత  YCP రాజ్య స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ రాజీనామాతో ఖాళీగా ఉన్నఎమ్మెల్సీ స్థానానికి ఆగ‌ష్టు 6వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఆగ‌ష్టు 13న నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ కాగా.. ఆగ‌ష్టు 24వ తేదీన పోలింగ్  జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి… రిజ‌ల్ట్ ను కూడా ప్రకటిస్తారు. పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ కూడా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కావ‌డంతో ఎమ్మెల్సీ స్థానానికి ‌రాజీనామా చేశారు. అయితే అత‌ని మండ‌లిలో కాల ప‌రిమితి కేవ‌లం ఆరు నెల‌లే ఉండ‌టంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వ‌హించ‌డం లేదు..

సీఎం జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపిక అయిన తర్వాత..వారు తమ మంత్రి పదవులతో పాటూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.