50 పీవో పోస్టులకు నోటిఫికేషన్

50 పీవో పోస్టులకు నోటిఫికేషన్
  • 50 పీవో పోస్టులకు నోటిఫికేషన్
  • 27 వరకు దరఖాస్తులకు గడువు


హైదరాబాద్, వెలుగు: హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో 50 ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. స్పెషలైజేషన్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసిన డాక్టర్లు ఈ పోస్టులకు అర్హులు. గైనకాలజీ విభాగంలో 17, అనస్థీషియాలో 14, రేడియాలజీలో 5, జనరల్ మెడిసిన్‌‌‌‌‌‌‌‌లో 3, పీడియాట్రిక్స్‌‌‌‌‌‌‌‌, ఆర్థోపెడిక్స్‌‌‌‌‌‌‌‌, జనరల్ సర్జరీలో 2 చొప్పున పోస్టులున్నాయి. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు 5 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ https://hyderabad.telangana.gov.in/) నుంచి డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకుని, విద్యార్హత, స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్లు జోడించి 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా హైదరాబాద్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో సమర్పించాలి. అకాడమిక్ మార్కులకు 90 పాయింట్లు, అకా డమిక్ ఇయర్ పూర్తయినప్పటి నుం చి ప్రతి ఏడాదికి ఒక్కో పాయింటు చొప్పున 10 పాయింట్లు ఇచ్చి, మెరిట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నోళ్లకు నౌకరీ ఇస్తారు.