
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మే 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్), పోస్ట్- బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి. 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: నార్‌సెట్-4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. సబ్జెక్టుకు సంబంధించి 180 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో
మే 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 3న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.aiimsexams.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.