కొంచెం బ్రేక్ తీసుకోండి బ్రదర్: స్క్రీన్ టైం తగ్గించేందుకు AI కొత్త ఫీచర్..

కొంచెం బ్రేక్ తీసుకోండి బ్రదర్: స్క్రీన్ టైం తగ్గించేందుకు  AI కొత్త ఫీచర్..

గేమింగ్ లేదా సోషల్ మీడియా యాప్స్  లాగానే  ప్రజలు ఇప్పుడు ChatGPTకి బానిసలవుతున్నారు. OpenAI ప్రకారం, ప్రజలు ChatGPTలో గంటల తరబడి చాటింగ్ చేస్తున్నారు, ఇది స్క్రీన్ చూసే అలవాటుని పెంచుతుంది అలాగే మానసిక ఆరోగ్యాన్ని ప్రభావం చేస్తుంది. దింతో OpenAI ఇప్పుడు ఎక్కువ సేపు లేదా గంటల తరబడి చాటింగ్ చేస్తే విరామం(break) లేదా రెస్ట్ తీసుకోవాలని గుర్తు చేసే ఫీచర్‌ ప్రారంభించింది.

కృత్రిమ మేధస్సు (AI)తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడంలో ఇది వినియోగదారులకు సహాయపడుతుందని OpenAI తెలిపింది. ఇంకా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు వారి మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది: కొత్త రిమైండర్ ఫీచర్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంటే చాటింగ్ సమయంలో  బ్రేక్ తీసుకోవడానికి ఇది మంచి సమయమా అనే పాప్-అప్ మెసేజ్ చూస్తారు. ఆ సమయంలో చాటింగ్ కొనసాగించవచ్చు లేదా కావాలనుకుంటే చిన్న విరామం తీసుకోవచ్చు. ఈ ఫీచర్ నింటెండో వంటి గేమ్‌లాగ ఉంటుంది, ఇందులో ఎక్కువసేపు గేమ్ ఆడిన తర్వాత కొద్దిసేపు  పాజ్ చేయమని సలహా ఇస్తుంది.

►ALSO READ | ఎస్బీఐ లాభం రూ.19,160 కోట్లు

ChatGPT సమాధానాలు కొన్నిసార్లు చాలా ఎక్కువగా అంగీకరించే విధంగా లేదా తప్పుడు సమాచారాన్ని ఇస్తాయని వార్తలు వచ్చిన తర్వాత మానసిక ఆరోగ్యం, కంటెంట్ క్వాలిటీ పై దృష్టి సారించి OpenAI ఈ మార్పు చేసింది. ఇప్పుడు కొత్త బ్రేక్ రిమైండర్ ఫీచర్ వినియోగదారులు ఇంకా AI మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవడానికి సహాయపడుతుంది. 

ChatGPT సమాధానాలు కొన్నిసార్లు తప్పుగా లేదా ఎక్కువగా నమ్మే విధంగా ఉన్నాయని వార్తలు వచ్చిన తర్వాత OpenAI ఈ మార్పులు చేసింది. ఇప్పుడు ఈ కొత్త బ్రేక్ రిమైండర్ ఫీచర్ వినియోగదారులు AI మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వినియోగదారుల మానసిక ఆరోగ్యం, కంటెంట్ నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు OpenAI పేర్కొంది.